twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెను సెక్స్ టార్చర్ పెట్టారు, ఆత్మహత్య చేసుకుంటానంది: భువనేశ్వరి

    గతంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నటి భువనేశ్వరి తాజాగా ఓ కేసుకు సంబంధించి కోర్టు మెట్లెక్కింది.భువనేశ్వరి తమ కూతురును కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ శ్రీలంక వాసి ఆమెపై కేసు వేశారు.

    By Bojja Kumar
    |

    గతంలో పలు వివాదాస్పద సంఘటనలతో హాట్ టాపిక్ అయిన నటి భువనేశ్వరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా భువనేశ్వరి మీద కిడ్నాప్ కేసు నమోదైంది. శ్రీలంకకు చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి భువనేశ్వరి మీద కేసు పెట్టారు. తన 23 ఏళ్ల కూతురిని భువనేశ్వరి చట్ట విరుద్ధంగా కస్టడీలో ఉంచుకుందని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ కేసు వేశారు.

    కోర్టుకు హాజరైన భుశనేశ్వరి

    కోర్టుకు హాజరైన భుశనేశ్వరి

    ఈ కేసును విచారణకు స్వీకరించిన మద్రాస్ కోర్టు.... సరెండర్ కావాల్సిందిగా భువనేశ్వరికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఇపుడు ఆ అమ్మాయి తన కస్టడీలో లేదని కోర్టుకు తెలిపారు.

    మరో వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయి

    మరో వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయి

    పిటీషనర్ కూతురు కూడా ఈ కేసు విచారణకు హాజరయ్యారు. ఇపుడు తాను ఇపుడు భువనేశ్వరి వద్ద ఉండటం లేదని, భువనేశ్వరి దత్తపుత్తుడు మిథున్ శ్రీనివాసన్‌ను తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని కోర్టుకు వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆ అమ్మాయికి సూచించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.

    నాపై అనవసరంగా ఈ కేసు పెట్టారు

    నాపై అనవసరంగా ఈ కేసు పెట్టారు

    విచారణ అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనను అనవసరంగా ఈ కేసులోకి లాగారని, ఇది ఒక వ్యక్తికి సంబంధించి సమస్యగా భావించాలని ఆమె కోరారు.

    ఆ అమ్మాయిని సెక్స్ టార్చర్ పెట్టారు

    ఆ అమ్మాయిని సెక్స్ టార్చర్ పెట్టారు

    ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి(కజిన్) ఆమెను సెక్స్ టార్చర్ పెట్టారని, ఈ విషయం ఆమె తనతో చెప్పుకుందని భువనేశ్వరి తెలిపారు.

    అతడితో సెక్స్ చేయాలని బలవంతంగా

    అతడితో సెక్స్ చేయాలని బలవంతంగా

    ఏది ఏమైనా ఇది చాలా పెద్ద సమస్య. ఆమె కుటుంబ సభ్యులే ఆ అమ్మాయిని ఆమెకు ఇష్టం లేని వ్యక్తితో సెక్స్ లో పాల్గొనాలని బలవంతం చేశారని, అది ఇష్టం లేని ఆమె తిరుచ్చిలోని ఇంటి నుండి తప్పించుకుని తన వద్దకు వచ్చిందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

    నా సహాయం కోరింది, అందుకే హెల్ప్ చేశాను

    నా సహాయం కోరింది, అందుకే హెల్ప్ చేశాను

    తనకు సహాయం చేయాలని ఆ అమ్మాయి తన వద్దకు వచ్చినపుడు నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు. ఒక మహిళగా, ఒక అమ్మగా ఆమెకు సహాయం చేయాలనుకున్నాను. ఆ అమ్మాయి తన వద్దకు వచ్చిన సమయంలో తన వద్ద ఆమె సేఫ్ గా ఉందని వెంటనే ముఖ్యమంత్రితో పాటు కమీషనర్‌కు లెటర్ రాసినట్లు భువనేశ్వరి తెలిపారు.

    వారితో పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంది

    వారితో పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంది

    ఆగస్టులో ఆ అమ్మాయి తన వద్దకు వచ్చినపుడే ఈ విషయం గురించి ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ద్వారా చెప్పాను. వారు తన ఇంటి వద్దకు వచ్చి ఆ అమ్మాయిని తమతో రమ్మని కోరారు. వారితో వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. బలవంతంగా పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఇదీ జరిగిన విషయం అంటూ భువనేశ్వరి మీడియాకు తెలిపారు.

    English summary
    South Indian Film and Television actor Bhuvaneswari on Tuesday appeared before the Madras high court in connection with a habeas corpus petition, which alleged that a girl is in illegal custody of the actor.Bhuvaneswari appeared before a division bench comprising Justices Rajiv Shakdher and N. Sathish Kumar when the HCP filed by Chandrakumar, a Sri Lankan national came up for hearing. She submitted that the petitioner’s daughter is not in her custody and she was in no way connected with the case. Meeting the press post the hearing, Bhuvaneshwari said, "I am unnecessarily being pulled into this case. It is a problem concerning a single individual. The girl had faced sex torture from her cousin, and used to express her feelings to me. But, I didn't interfere with the problem because I didn't want to create a ruckus or commotion inside the family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X