Don't Miss!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
లాంగ్ గ్యాప్ తర్వాత బెగ్గర్ పాత్రలో నవ్వించబోతున్న బాబూ మోహన్ (ట్రైలర్)
తెలుగు సినిమాల్లో బిచ్చగాడి పాత్రలు అనగానే అందరికీ పాపులర్ కమెడియన్ బాబు మోహన్ గుర్తుకొస్తాడు. కోట-బాబు మోహన్ కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాల్లో బెగ్గర్ పాత్రలో ప్రేక్షకులను తెగ నవ్వించిన బాబూ మోహన్... పిట్టల దొర సినిమాలో 'ఇంత కూరుంటేయ్యమ్మో... ఇంత బువ్వుంటెయ్యమ్మో' అనే పాటతో ఓ ఊపు ఊపాడు. మళ్లీ చాలా కాలం తర్వాత బాబూ మోహన్ బిచ్చగాడి పాత్రలో ప్రేక్షకులను నవ్వించబోతున్నాడు.
ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మిస్తున్నవినూత్న కథాచిత్రం 'బిచ్చగాడా మజాకా'. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ' అన్నది ట్యాగ్ లైన్. అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో బాబూమోహన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.... ఈ సినిమాలో బాబూ మోహన్‌పై బెగ్గింగ్ బ్యాక్ డ్రాపులో ఓ పాట కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ మేము బయట అడుక్కుంటుంటే... అక్కడ మీరు లోపల దేవుడిని అడుక్కుంటున్నారు అంటూ బాబూమోహన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మలకి మదర్స్ డే, నాన్నలకు ఫాదర్స్ డే, ప్రేమికులకు ఫాదర్స్ డే ఉన్నట్లే... మాకు బెగ్గర్స్ డే ఉండాలి అంటూ బాబూ మోహన్ మీద ప్రత్యేకంగా పాట చిత్రీకరించారు.
రాజశ్రీ నాయర్, కె.ఎస్.రాజు, గౌతమ్ రాజు, చిట్టిబాబు, తిలక్, శ్రీధర్ రానా ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్: రమేష్ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్: వి.పురుషోత్తం రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు-నిర్మాత: బి.చంద్రశేఖర్ (పెదబాబు), స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కె.ఎస్.నాగేశ్వరావు!!