యాచకుల కోసం హీరో విజయ్ వినూత్న ఆలోచన.. 'బిచ్చగాడు 2' విజయంతో అలా.. భారీగా 'బిచ్చగాడు 3'

తమిళ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ తర్వాత చిన్న సినిమాల్లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో మాస్ మహారాజా దరువు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ ఆంటోనీ ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో యాచకుల కోసం హీరో విజయ్ ఆంటోనీ వినూత్న ఆలోచన చేసి అమలు పరిచాడు.

మరింత పాపులారిటీ: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన నకిలీ, డా. సలీమ్, డా. సలీమ్ 2 చిత్రాలు మంచి విజయం సాధించాయి. అంతేకాకుండా అవి తెలుగులోనూ డబ్ అయి హిట్ కావడంతో విజయ్ కు డిఫరెంట్ క్రేజ్ వచ్చింది. ఇక 2014లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయ్యాడు ఈ హీరో.

Bichagadu 2 Vijay Antony Produce Anti Bikili Kits To Beggars In Tirupati

దర్శకత్వం కూడా: అనంతరం బేతాళుడు (సైతాన్), యమన్, ఇంద్రసేన, కాళి, రోషగాడు, కిల్లర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కు బిచ్చగాడు రేంజ్ లో సక్సెస్ రాలేదు. ఇటీవలే బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ హీరోతోపాటు దర్శకత్వం కూడా వహించాడు.

Bichagadu 2 Vijay Antony Produce Anti Bikili Kits To Beggars In Tirupati

యాంటీ బికిలీ: కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 19న విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది. బిచ్చగాడు 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో విజయోత్సవం చేపట్టింది మూవీ టీమ్. ఈ విజయోత్సవంలో భాగంగానే తిరుపతిలో సందడి చేశాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా ప్రదర్శిస్తున్న సీఎస్ సినిమాస్ థియేటర్ కు వెళ్లి అక్కడున్న యాచకులకు "యాంటీ బికిలీ" పేరిట కిట్లు అందజేశారు.

Bichagadu 2 Vijay Antony Produce Anti Bikili Kits To Beggars In Tirupati

అప్పుడే నిర్ణయం: ఆ యాంటీ బికిలీ కిట్ లో దుప్పటి, చెప్పులు, అద్దం, సబ్బు, నూనె బాటిల్, దువ్వెన, విసనకర్ర ఉన్నాయి. యాచకులతో సరదాగా గడిపిన విజయ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. "బిచ్చగాడు 2 విజయంపై చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. ఇంత ఆదరణ నేను ఊహించలేదు. ఈ విజయం తర్వాతే బిచ్చగాడు 3 తీయాలని నిర్ణయించుకున్నా" అని విజయ్ ఆంటోనీ తెలిపారు.

Bichagadu 2 Vijay Antony Produce Anti Bikili Kits To Beggars In Tirupati

మళ్లీ 50వ రోజు: "బిచ్చగాడు 3 సినిమాను 2025లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా. బిచ్చగాడు రెండు సినిమాలతో పోలిస్తే పార్ట్ 3 మరింత గ్రాండ్ గా ఉంటుంది. బిచ్చగాడు 2 కనీసం 50 రోజులు ప్రదర్శితమవుతుంది. మళ్లీ 50వ రోజు తిరుపతి వచ్చి అందరినీ కలుస్తాను. బిచ్చగాడు పార్ట్ 3 కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది. మీకు మరిన్ని మంచి సినిమాలు అందించేందుకు బాధ్యగా పనిచేస్తాను" అని విజయ్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X