twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బిచ్చగాడు’ సినిమాకు కలెక్షన్లే కలెక్షన్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్' ను తెలుగులో 'బిచ్చగాడు' అనే పేరుతో మే 13న విడుదలై చేశారు.

    సినిమా సినిమా హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా... చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ''మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా బిచ్చగాడు చిత్రమే నిదర్శనం. ప్రతిరోజు, ప్రతి షోకు ఆదరణ పెరుతుంది' అన్నారు.

     Bichagadu Collections Better than other movies

    విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందన్నారు.

    అన్ని ఏరియాల నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్స్ ను ఇంకా పెంచుతున్నాం. మా బిచ్చగాడు చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని నిర్మాత పేర్కొన్నారు.

    English summary
    Vijay Antony dubbed film Bichagadu collections better than collections of ther telugu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X