‘బిచ్చగాడు’ షాకింగ్ కలెక్షన్స్, భారీ లాభాలు....వివరాలు!
హైదరాబాద్: చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్' ను తెలుగులో 'బిచ్చగాడు' అనే పేరుతో మే 13న విడుదలై చేశారు.
ఈ సినిమా తెలుగు బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగాకలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా ప్రస్తుతం అన్ని చోట్లా బాగా నడుస్తోంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ. 8 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని టాక్. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కేవలం రూ. 50 లక్షలకే తీసుకున్నారట. దీన్ని బట్టి లాభాలు ఏ రేంజిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా... చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ''మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా బిచ్చగాడు చిత్రమే నిదర్శనం. ప్రతిరోజు, ప్రతి షోకు ఆదరణ పెరుతుంది' అన్నారు. సినిమా హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అన్నారు.

విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందన్నారు.
అన్ని ఏరియాల నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్స్ ను ఇంకా పెంచుతున్నాం. మా బిచ్చగాడు చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని నిర్మాత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











