»   » సినీ పండుగకు విభజన సెగ: మోహన్ బాబు లేఖ

సినీ పండుగకు విభజన సెగ: మోహన్ బాబు లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mohan Babu
హైదరాబాద్: తెలుగు చలన చిత్రసీమ వందేళ్ల పండుగకు రాష్ట్ర విభజన సెగ తగులుతోంది. ఈ వేడుకలను వాయిదా వేయాలని వేయాలని కోరుతూ మోహన్ బాబు ఫిల్స్ చేంబర్‌కు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన విషయంపై సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో వందేళ్ల సినిమా పండుగ చేసుకోవడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్న ఈ సమయంలో సినిమా పండుగ జరపడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో చెన్నైలో నిర్వహించాలనుకున్న వందేళ్ల సినిమా పండుగను వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రజలు కన్నీరు పెడుతుంటే పన్నీరు చల్లుకోవడం ఏమిటని ఆయన లేఖలో రాశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు చిత్రసీమకు రెండు కళ్లలాంటివని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సెగ తెలుగు సినీ పరిశ్రమను చాలా కాలంగా తాకుతూనే ఉన్నది.

కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను సమైక్యాంధ్ర, తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తుఫాన్ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.

English summary
Eminent Telugu film actor Mohan Babu wrote letter to Film Chamber appealing to postpone 100 years celebrations of Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu