»   » విభజన వల్ల సినీ పరిశ్రమకు నష్టం లేదు

విభజన వల్ల సినీ పరిశ్రమకు నష్టం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bifurcation not impact Telugu Film Industry: Suresh Babu
విజయవాడ: రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమకు నష్టం లేదని నిర్మాత డి.సురేష్‌ బాబు అన్నారు. శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో షూటింగ్‌కు అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని నిర్మాత డి.సురేష్‌బాబు ఆకాంక్షించారు.

కాగా...ఇటీవల ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమ గురించి సురేష్ బాబు మాట్లాడుతూ 'చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ను వీడుతుందా అని అందరూ అడుగుతున్నారు. ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుంది. అది విశాఖపట్నమా లేక విజయవాడా అనేది మరో ఐదేళ్లలో తేలిపోతుందన్నారు.

ఛాంబర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. చెన్నై నుంచి వచ్చి చిత్రీకరణలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఛాంబర్ లేదు. ఛాంబర్ అనేది కేవలం ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి మాత్రమే. ప్రధాన కేంద్రంలో ఛాంబర్ ఉంచి.. మనకు అనువైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపొచ్చు. అది ఆదిలాబాద్ కావొచ్చు.... రాజమండ్రి కావచ్చు' అని తెలిపారు.

English summary
Producer Suresh Babu says 'Andhra Pradesh Bifurcation not impact Telugu Film Industry'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu