»   » ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

  నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ అనుకోని కారణాలతో తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు బ్రేక్ పడింది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను తాను అనుకున్న విధంగా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బాలయ్య తన వందో చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి పేరు వెల్లడించారు.

  మొనగాడు ‘‘యన్. టి. ఆర్’’

  మొనగాడు ‘‘యన్. టి. ఆర్’’

  జనని భారతి మెచ్చ... జగతి హారతులెత్త... జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..రణభేరి మ్రోగించె తెలుగోడు..జయగీతి నినదించె మొనగాడు..‘‘యన్. టి. ఆర్'' అని పేర్కొన్న బాలయ్య ఆ నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు, నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము.. అని వెల్లడించారు.

  వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది.

  వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది.

  చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది..ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది..ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి', ఈ చరిత్రకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను.... అని బాలయ్య తెలిపారు.

  ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం

  ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం... ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం..నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది... అని బాలయ్య తెలిపారు.

  మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను: క్రిష్

  మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను: క్రిష్

  బాలయ్య ప్రకటనపై దర్శకుడు క్రిష్ స్పందించారు. ‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను' అని పేర్కొన్నారు.

  ఎన్టీఆర్ బయోపిక్

  ఎన్టీఆర్ బయోపిక్

  ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం బేనర్లో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తుండగా, రామకృష్ణ సబ్బని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 2019 సంక్రాంతికి మూవీ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  On the eve of NTR’s birth anniversary, makers of the legendary actor-politician’s biopic made an important announcement. Krish Jagarlamudi will be directing the film. The announcement was made through a video, voiced by Balakrishna himself as he hoped to get his father’s blessing for the project.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more