తుఫాన్: మెగాస్టార్ గెస్ట్ రోల్ ఉందన్న రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీతో పాటు తెలుగులో కూడా ఈచిత్రాన్ని ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుతున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని 'తుఫాన్' పేరుతో విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 1973లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని అదే టైటిల్‌తో చెర్రీ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ నటిస్తున్న ఈ రీమేక్ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ గెస్ట్‌రోల్ చేస్తే బాగుటుందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. అయితే యూనిట్ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదని ఆ మధ్య ఆ వార్తలను కొట్టిపారేసారు.
అయితే అమితాబ్ అభిమానుల కోరిక మేరకు 'జంజీర్' చిత్రంలో ఆయన గెస్ట్ రోల్‌ను తాజాగా ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ్ ఇటీవల మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది. సో.... జంజీర్ సినిమాలో ఓ చోట అమితాబ్ గెస్ట్ పాత్రలో తళుక్కున మెరవనున్నారన్నమాట.
అయితే హిందీ వెర్షన్ జంజీర్ వరకు మాత్రమే అమితాబ్ గెస్ట్ రోల్ పరిమితమని, తెలుగు వెర్షన్ 'తుఫాన్' లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వేసవి చివర్లో అంటే జూన్ నెలలో ఈ చిత్రం థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.


Click it and Unblock the Notifications











