»   » కోల్‌కతా రోడ్లపై బిగ్ బి స్కూటర్ సవారీ

కోల్‌కతా రోడ్లపై బిగ్ బి స్కూటర్ సవారీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‌కత్తా : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కోల్‌కత్త రోడ్లపై స్కూటర్ నడిపారు. ఆయన వెంట మరో నటుడు నవాజుద్దిన్ సిద్ధిక్ కూడా ఉన్నారు. టె3ఎన్ అనే సినిమా షూటింగులో భాగంగా ఆదివారం పెద్దగా ట్రాఫిక్ లేని సమయంలో ఇద్దరూ స్కైటర్ రైడ్ చేసారు.

ఈ సినిమకు రీబూ దాస్‌గుప్తా తీస్తున్న దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాల్లోకి రాక ముందు ఉద్యోగం కోసం అమితాబ్ కోల్‌కత్తా వీధుల్లో తిరిగారు. మళ్లీ ఆయన అదే వీధుల్లో స్కూటర్ మీద తిరుగడంతో పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 1960వ దశకంలో అమితాబ్ కోల్ కతాలో పని చేసారు.

Big B drives scooter with 'Te3n' co-actor Nawazuddin Siddiqui in Kolkata

అక్కడ కొంత కాలం పని చేసిన తర్వాత 1969లో ‘భువన్ శోమ్', ‘సాథ్ హిందూస్తానీ' అనే సినిమాల ద్వారా ఆయన నటనారంగంలోకి వచ్చారు. క్రమ క్రమంగా బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు. బాలీవుడ్ లెజెండరీ నటుల నటుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

73 సంవత్సరాల వయసులో కూడా అమితాబ్ నటుడిగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. మధ్యలో అనారోగ్యం పాలైనా, వయసు సహకరించక పోయినా...సినిమాలపై మక్కువతో ఆయన దూసుకెలుతున్నారు. వయసుకు తగిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. టె3ఎన్ సినిమాతో పాటు ‘వాజిర్' అనే చిత్రంలో కూడా అమితాబ్ నటిస్తున్నారు.

English summary
After riding a bicycle at the age of 72 for Piku, Bollywood megastar Amitabh Bachchan was now spotted driving a scooter on the streets of Kolkata with his co-actor Nawazuddin Siddiqui sitting behind him. The two actors will be seen in the upcoming Ribhu Dasgupta film 'Te3n'.
Please Wait while comments are loading...