రజనీతో పోల్చుకుని చిన్న హీరోని అన్నారు
'నాలాంటి చిన్నాచితక హీరోల చిత్రాలకు జనాలు రావాలంటే మేం వారిని ఇలాంటి ప్రోమోల ద్వారా ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. మీలాంటి వారికి అది అవసరం లేదు' అని రజనీకాంత్ తో చెప్పాను అన్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. ప్రస్తుత ప్రపంచంలో సినిమాలు ప్రమోషన్ అనేది ఎంతో ముఖ్యమైందని చెప్తూ ఈ విషయం ప్రస్దావించారు. అలాగే.. ప్రచార చిత్రాలన్నీ ప్రేక్షకులను వారం రోజుల పాటు సినిమా థియేటర్లకు రప్పించడానికి బాగా పనికొస్తాయి. ఇలాంటి అవసరాలు అందరికీ వర్తిస్తాయి కానీ రజనీ నటించిన సినిమాలకు కాదు.ఆయన సినిమాలకు ఇలాంటి ప్రోమోలు ఏమీ లేకపోయినా అభిమానులు వారం రోజుల పాటు అమితాసక్తితో థియేటర్లలో నిండిపోతారు అని రజనీ గొప్పతనాన్ని వివరించారు అమితాబ్. అదీ అమితాబ్ గొప్పతనం.


Click it and Unblock the Notifications











