»   » అమితాబ్ బచ్ఛన్ జార్ఖండ్ పోలీస్ ఇన్ ఫార్మరా...?

అమితాబ్ బచ్ఛన్ జార్ఖండ్ పోలీస్ ఇన్ ఫార్మరా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమితాబ్ బచ్ఛన్ జార్ఖండ్ పోలీస్ ఇన్ ఫార్మరా..? ప్రస్తుతం ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఇది నిజమా కాదా అని తెలియాలంటే మాత్రం ఈ మేటర్ చదవాల్సిందే అంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన డిజిపి విష్ణుదయాల్ రామ్ మాట్లాడుతూ ఇంటలిజెన్స్ కు సంభందించిన ఇన్ ఫార్మర్ సానిచార్ పండిట్ కి రూ 21 లక్షలుకీ గాను రెండు వోచర్స్ ఇవ్వడం జరిగినది. ఈ రెండు వోచర్స్ మీద అమితాబ్ బచ్ఛన్ సంతకం వున్నట్టు ఆయన చెప్పారు. కాని దీనికి సంభందించిన ఇన్ ఫార్మర్ కు కేవలం రూ 10,000 మాత్రమే అందినట్టు తాను చెప్తున్నాడు. ఈ డబ్బు అంతా స్టేట్ సేక్రటరీ నుండి చెల్లించినట్టు వుందన్నారు. ఇంటలిజెన్స్ ఇన్ ఫార్మర్ పండిట్ హైకోర్టు ముందు మాత్రం తనకు అమితాబ్ బచ్ఛన్ సంతకం ఎలా వచ్చిందో తెలియదని, తాను కేవలం పోలీసుల క్రింద మాత్రమే ఇన్ పార్మర్ గా పనిచేసేవాడినని అన్నాడు. మొత్తం ఈ కుంభకోణాన్ని జార్ఖండ్ ఎకౌంట్ జనరల్ కి తెలియజేశామని ఆయన అన్నారు.

దీనికి సంభంధించిన మొత్తం కుంభకోణాన్ని జార్ఖండ్ ఛీఫ్ సేక్రటరీ ఎ.కె.సింగ్ జార్ఖండ్ హైకోర్టు లో సమర్పించారు. ఈ సమయంలోనే జార్ఖండ్ అదనపు డిజిపి రాజీవ్ కుమార్ రూ8 కోట్లుని స్టేట్ సేక్రటరీ సర్వీస్ నుండి తీసుకున్నారని, కాని దానికి సంభంధించిన ఖర్ఛులను మాత్రం జతపరచలేదన్నారు. అంతేకాకుండా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లుకు కూడా ఫండ్స్ ని బదలాయించారని వారి పేర్లు కనీసం రిజిస్టర్ కూడా చేయలేదని ఇలా అందరిమీద ఎంక్వైరీ వేశామని, దానికి సంభంధించినటు వంటి సమాచారాన్ని మొత్తం ఆగస్టు 28వ తారీఖు లోపు కోర్టుకి సమర్పిస్తామని డిజిపి రామ్ అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu