'డిపార్టమెంట్'లో అమితాబ్ పాత్ర అదే..రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ తాజాగా డిపార్టమెంట్ గురించి బాలీవుడ్ మీడియాతో నోరు విప్పారు. ఆయన మాట్లాడుతూ...వచ్చే సంవత్సరం ప్రారంబమయ్యే డిపార్టమెంట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్..పొలిటీషయన్ గా మారిన గ్యాంగస్టర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే నా కెరీర్ లో ఈ చిత్రం బాగా ఎక్కవ బడ్టెట్ అవుతోంది. స్క్రిప్టు కూడా చాలా ప్రెష్ గా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి బయట రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి.
అమితాబ్..పోలీస్ ఆఫీసర్ గా నటించటం లేదు. అలాగే ఈ చిత్రం కంపెనీ కి సీక్వెల్ కాదు..అలాగే అబతక్ చప్పన్ కి ప్రీక్వెల్ కూడా కాదు. ఇక నాకు ఎప్పుడూ అమితాబ్ ని మాస్ హీరోగానే చూస్తాను. ఆయన్ని లార్జర్ దేన్ లైఫ్ హీరోగా డిపార్టమెంట్ లో చూపదలుచుకున్నాను. అభిషేక్ ఈ చిత్రంలో చేస్తున్నాడు కానీ...అమితాబ్..అభిషేక్ తండ్రి కొడుకులు గా కనపడరు. అభిషేక్, సంజయ్ దత్ ఇద్దరూ పోలీస్ లు కనిపిస్తారు. అభిషేక్ కు మెంటర్ గా సంజయ్ దత్ కనిపిస్తారు. ఇక ఈ విషయం విన్న అమితాబ్..నన్ను పొలిటీషయన్ గా రాము చూపించనున్నారా..ఇంకా నా దగ్గర ఆ పాత్ర గురించి టాపిక్ రాలేదు అని ఆయన స్పందించారు.


Click it and Unblock the Notifications











