twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నకిలీ ఐశ్వర్యను పట్టుకున్న బిగ్ బి

    By Bojja Kumar
    |

    ఇదే ఐశ్వర్య రాయ్ ప్రసవం తర్వాతి ఫోటో అంటూ...ఐశ్వర్యరాయ్ తన కూతురుని ఒళ్లో పెట్టుకున్నట్లు ఉన్న ఓ నకిలీ ఫోటో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో అసలైంది కాదని, మార్ఫింగ్ ఫోటో అంటూ ఇప్పటికే బిగ్ బి ప్రకటించారు కూడా. తాజా ఆఫోటోలకు సంబంధించిన మిస్టరీని బిగ్ బి ఛేధించారు. ఐశ్వర్య ముఖాన్ని మార్ఫింగ్ చేసిన అసలు ఫోటోను పట్టుకున్నారు.

    ఫోటోను గుర్తించిన తర్వాత బిగ్ బి ఫుల్ జోష్ మీద ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్ మేన్ నేను ఆ నకిలీ ఫోటోకు సంబంధించి మిస్టరీని చేధించాను అంటూ తన బ్లాగు Bigb.bigadda.comలో పేర్కొన్నారు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేసిన వారు తమ టాలెంట్ ప్రదర్శించారు. ఏది ఏమైనా దొంగలు దొరికారు అంటూ బిగ్ బి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మనవరాలిని చూపించాలని బిగ్ బిని చాలా మంది రిక్కెస్ట్ చేస్తున్నప్పటికీ 69 ఈ ఓల్డ్ మ్యాన్ అందుకు అస్సలు అంగీకరించడం లేదు. మరి బిగ్ బి మనవరాలిని చూడాలన్న అభిమానుల ఆశ ఎప్పటికి తీరుతుందో? ఏమో?

    English summary
    Amitabh Bachchan has thanked his extended family (EF) for finding the original morphed image of his new-born granddaughter's picture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X