మీడియాకు థ్యాంక్స్ : అమితాబ్
మనవరాలు పుట్టిన ఆనందంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. రోజులో ఎక్కువ సయమం పాపాయితోనే గుడుపుతున్నారు. తన బ్లాగులో పోస్టుల మీద పోస్టుల చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత కాలం మీడియా సంయమనం పాటించినందుకు థాంక్స్ అన్నారు. మా ఇంటికి మహా లక్ష్మి వచ్చింది. అచ్చం ఐశ్వర్య లాగే ఉంది, పాపాయితో గడుపుతుంటే అస్సలు సమయమే తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే నా మనవరాలి ఫోటోలు విడుదల చేస్తాం. దీనిపై మీడియా, ఇతరులు అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని బిగ్ బి సూచించారు.
కాగా...ఈ క్రిస్‌మస్ వరకు బేటి బికి పేరు పెట్టాలని బచ్చన్ ఫ్యామిలీ యోచిస్తోంది. ఇప్పటికే అభిషేక్ తన కూతురికి A అక్షరంతో మొదలయ్యే పేరును సూచించాలని తన ట్విట్టర్ లో అభిమానులను కోరారు. అందాల తార ఐశ్వర్య కూతురు ఎవరికీ లేనటువంటి విభిన్నమైన పేరుతో నామకరణం చేయబడుతుందనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











