కనుక్కోండి చూద్దాం: ఈ ఫోటోలో మెగాస్టార్ ఎక్కడ? (ఫోటో)
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చిన్ననాటి ఫోటో ఒకటి పోస్టు చేసిన అభిమానులకు పరీక్ష పెట్టాడు. తన బాయ్ స్కౌట్స్ డేస్ కు సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన అమితాబ్ ఈ ఫోటోలో తాను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టాడు. అయితే ఆ ఫోటోలో క్రింద ఉన్న పేర్లను చదవకుండా తనను కునుక్కోవాలంటూ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి....
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్త... 72 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన ‘పికు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘వాజిర్'.
‘వాజిర్' చిత్రానికి బిజయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా అతిథి రావు హైదరి, పర్హాన్ అక్తర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











