twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేరీకోమ్‌తో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బాక్సింగ్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్...బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్‌తో బాక్సింగ్‌కు దిగాడు. అయినా పవర్ పంచ్‌లు ఇవ్వడంలో ఆరితేరిన మేరికోమ్‌తో పెట్టుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది. మేరీకోమ్ ఆత్మకథ 'అన్‌బేకబుల్' పుస్తకాన్ని ఆవిష్కరించిన అమితాబ్ సరదాగా ఆమెతో బాక్సింగ్ చేసాడు.

    ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ...మేరీ కోమ్‌ను మహిళా దిగ్గజంగా పేర్కొన్నారు. బాక్సింగ్ లాంటి క్రీడల్లో మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మేరీకోమ్ నిరూపించారని, ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకమని, ఆమె ఆత్మకథ చదివి స్పూర్తి పొందాల్సిన అవసరం ఉందని అమితాబ్ వ్యాఖ్యానించారు. మేరీ కోమ్ మాట్లాడుతూ...తాను ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో ఈ పుస్తకంలో ఉందని, తనలాగా కష్టపడుతున్న మహిళల్లో స్పూర్తిని నింపేందుకే ఆటోబయోగ్రఫీ విడుదల చేసినట్లు తెలిపారు.

    ఒలింపిక్ బాక్సింగ్ విభాగంలో దాదాపు ఐదుసార్లు పతకాలను సాధించిన మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మేరీ కోమ్ పాత్రలో ప్రియాంకా చోప్రా నటించనుంది. ఒమంగ్ కుమార్ దర్శకుడు.

    ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మేరీ కోమ్ పాత్ర పోషించనుంది. 'ఈ మధ్యే బాక్సర్ మేరీకోమ్‌ను కలిసాను. ఆమె పాత్రలో నటిస్తున్నానని తెలిసి ఆమె చాలా ఆనందించారు. ప్రస్తుతం బాక్సర్‌గా ఏవిధంగా మెప్పించాలన్న విషయం గురించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను' అని అంటోంది ప్రియాంకా చోప్రా.

    English summary
    Olympic medal-winning boxer M.C. Mary Kom has made innumerable contributions in breaking stereotypes about women, especially from the northeast, megastar Amitabh Bachchan said Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X