SSMB29 మహేష్ పై కీలక సీన్ లీక్.. రాజమౌళికి మరో బిగ్ షాక్..

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న పాన్ వరల్డ్ లెవెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా సెన్సేషనల్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం రాజమౌళిలు చేస్తున్న సినిమానే అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకి షూటింగ్ కి పట్టాలెక్కింది.

గ్లోబల్ సెన్సేషనల్ హిట్ ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం అది కూడా ఎప్పుడు నుంచో మహేష్ బాబు అభిమానులు కూడా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ కూడా కావడంతో దీనిపై ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ హైప్ నెలకొంది.

big blow for ss rajamouli ssmb29 footage got leaked

ఇలా రాజమౌళి మార్క్ లో మన ఇండియన్ సినిమా లానే ప్రపంచ స్థాయి ప్రేక్షకులుకి రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమాని ఇపుడు తెరకెక్కిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ సినిమాకి ఇపుడు లీక్ షాకులు తగులుతున్నాయి. కాగా ఈ సినిమా మొదలై వారాలు మాత్రమే అవుతుంది కానీ ఈ లోపలే సినిమా సెట్టింగ్ లు లీక్ అయ్యాయి.

కాగా దీనికి మించిన బిగ్ షాక్ ఇపుడు జక్కన్నకి ఏమన్నా ఉంది అంటే అది ఇపుడు ఏకంగా సినిమా షూటింగ్ స్పాట్ సినిమాలోని సన్నివేశం అది కూడా సూపర్ స్టార్ మహేష్ పైనే లీక్ అయ్యిపోయింది. దీనితో ఈ సీన్ చూసిన మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తన ముందు ఎవరో వీల్ చైర్ లో కూర్చుని ఉంటే మహేష్ ని మోకాలిపై తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు.

దీనితో ఇదేదో మహేష్ బాబుకి విలన్ కి నడుమ సాలిడ్ సన్నివేశంలా ఉందని మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఇక్కడ ఇలాంటి మహా ప్రాజెక్ట్ నుంచి లీక్ కోసం పట్టించుకోకుండా షేర్ చేసుకుంటున్నారు. కాగా రాజమౌళి సినిమాల నుంచి లీక్స్ అనేవి అంత సాధారణంగా రావు. అప్పట్లో బాహుబలి 1 కి అయితే ఏకంగా నిమిషాలు వ్యవధి ఫుటేజ్ లీక్ అయ్యిపోయింది కానీ RRR కి అలా కనివ్వలేదు.

కానీ ఇపుడు మహేష్ బాబు సినిమాకి లీక్స్ అది కూడా వీడియో లీక్స్ అప్పుడే మొదలు కావడం షాకింగ్ అని చెప్పవచ్చు. కాగా దీనిపై రాజమౌళి బృందం ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేక నిర్మాణ సంస్థ నుంచి కానీ ఏమన్నా వస్తాయా అనేది వేచి చూడాలి. కాగా ఈ చిత్రాన్ని జక్కన్న ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అందులో మన మైథాలజీ ఎలిమెంట్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాని ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో కూడిన ప్రాజెక్ట్ గా సుమారు 1000 కోట్లు పెట్టి చేస్తున్నట్టుగా టాక్. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: ssmb28 ssrmb mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X