Just In
- 6 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 30 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 35 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 42 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మా ఆవిడ అంటూ సల్మాన్ - విక్రమ్ వాదన: నవ్వులు
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం తమిళం, తెలుగు, హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ప్రమోషన్లో భాగంగా ‘ఐ' టీం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ....నా మిత్రుడు విక్రమ్ ప్రతి సినిమాకు తనను తాను మార్చుకుంటున్నాడు. అతని రూపం, బాడీ ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది. అలా సాధ్యమో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది అని వ్యాఖ్యానించారు. దీనికి విక్రమ్ సమాధానం ఇస్తూ...మీరేమో ఇలా అంటున్నారు. మా ఆవిడేమో మీలా తయారవమంటోంది అన్నారు. దీనికి సల్మాన్ రిప్లై ఇస్తూ రేపు పెళ్లయితే మా ఆవిడ విక్రమ్ లా తయారవమంటుందేమో అంటూ కౌంటర్ వేసాడు. వీరి సంబాషణ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది.

ఇప్పటికే ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో విడుదల కాగా, తెలుగు వెర్షన్ ఆడియో నేటి(డిసెంబర్ 30) సాయంత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్ హయత్ హోటల్ లో ఆడియో వేడుక ప్లాన్ చేసారు. కాగా...ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైన కేవలం 8 రోజుల్లోనే యూట్యూబులో 5 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. అత్యధిక హిట్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఈ ట్రైలర్ రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా కూడా ఈ చిత్రం టాప్ పొజిషన్లో ఉంది.
దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.