ఆయన తప్ప అందరూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే!

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పడం లేదు. ఈ రోజు(డిసెంబర్ 3) సాయంత్రం జరిగే ‘ముకుంద' ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ వేడుకకు రావడం లేదని తేలింది. అయితే పవన్ కళ్యాణ్ తప్ప మిగతా మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తదితరులు హాజరవుతున్నారు.

Big disappointment for Pawan Kalyan fans

మరో మెగా నట వారసుడు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు.

ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X