twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌కు తొడగొడుతున్న బాలయ్య.. బస్తీమే సవాల్ అంటే అదే..

    నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య 102వ చిత్రం కోసం దర్శకుడు కేఎస్ రవికుమార్ జతకట్టాడు. అయితే గతేడాది కంటే ఈ సంక్రాంతికి పోటీ మరీ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎ

    By Rajababu
    |

    నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. గౌతమి పుత్రి శాతకర్ణితో సెంచరీ కొట్టిన బాలయ్య.. ఆ తర్వాత పైసా వసూల్ చిత్రం శరవేగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 102వ చిత్రం కోసం దర్శకుడు కేఎస్ రవికుమార్ జతకట్టాడు. అయితే గతేడాది కంటే ఈ సంక్రాంతికి పోటీ మరీ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ సారి పోటీకి దిగుతున్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాబట్టి...

    మరోసారి సంక్రాతి బరిలో

    మరోసారి సంక్రాతి బరిలో

    త్వరలోనే కేఎస్ రవికుమార్ సినిమాను పూర్తి చేసి బాలయ్య మరోసారి సంక్రాతి బరిలో అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నాడు. అందుకు భారీగానే ప్రణాళికను సిద్ధం చేసుకొన్నాడు. బ్రహ్మండమైన సెంటిమెంట్ కథ, ముగ్గురు హీరోయిన్లను అస్త్రాలుగా దించేస్తున్నాడు.

    మెగాస్టార్‌ చిరంజీవితో పోటీ

    మెగాస్టార్‌ చిరంజీవితో పోటీ

    గతేడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే బాలయ్య పోటీకి సిద్ధపడ్డాడు. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ప్రతిష్ఠాత్మకంగా బాలయ్య 10వ చిత్రంతో ముందుకొచ్చాడు. ఈ సినిమాల రిలీజ్‌కు సినీ పరిశ్రమలో వాతావరణం ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే.

    ఫ్యాన్స్ అండదండలు

    ఫ్యాన్స్ అండదండలు

    మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలకు అభిమానులు అండదండలు అందించడంతో ఇద్దరు ఘన విజయాలను అందుకొన్నారు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొన్నది.

    పవన్ వర్సెస్ బాలయ్య

    పవన్ వర్సెస్ బాలయ్య

    వచ్చే సంక్రాంతికి కూడా సినీ అభిమానులకు మరోసారి మరింత పండుగ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బాలకృష్ణ తన 102వ సినిమాతో వస్తుండగా, పవన్ కల్యాణ్ తన 25వ చిత్రం వస్తున్నాడు. పవన్ కల్యాణ్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిసున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి జోడి హ్యాట్రిక్ సిద్ధమవుతున్నది.

    నువ్వా..నేనా

    నువ్వా..నేనా

    వచ్చే సంక్రాంతి బరిలో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ చిత్రాలు నువ్వా నేనా అనే మాదిరిగా పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ ఇద్దరి అగ్రహీరోల చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    A big fight evident between Tollywood's big heroes. For this Sankarati, Balakrishna, Pawan Kalyan's movies are slated to release. This will be a tough for both super stars to get attention of Audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X