బాలీవుడ్ బిగ్ ఛాన్స్: సింగర్ సునీత న్యాయ నిర్ణేతగా (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్లో పాడే అవకాశం వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. దేశ వ్యాప్తంగా ఎందరో అటువంటి అవాశాల కోసం కలలు కంటూ ఉంటారు. మీ కలలను సాకారం చేసేందుకు, సీజన్ 1లో కనీవినీ ఎరగని విజయాన్ని, ఆదరణను చవిచూసిన 92.7 బిగ్ ఎఫ్ఎం దేశవ్యాప్తంగా 37 సామాజిక సాంస్కృతిక ప్రాంతాలలో గాయనీ గాయకుల కోసం బిగ్ గోల్డెన్ వాయిస్ సీజన్-2 పోటీలను నిర్వహిస్తోంది.
బిగ్ ఎఫ్ఎం దేశ వ్యాప్తంగా ఉన్న 44 రేడియో స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించనుంది. శ్రోతలు తమ తమ ప్రాంతాల నుండి ఓటింగ్ ద్వారా ఎంచుకున్న అద్భుతమైన గళాలను ప్రాంతాల వారీగా, తదుపరి జాతీయంగా ఎంపిక చేసివారిని గ్రాండ్ ఫైనల్ కు పంపి వారిలో విజేతలుగా నిలిచిన వారికి నేరుగా బాలీవుడ్లో పాడే సదవకాశాన్ని బిగ్ ఎఫ్ఎం కల్పిస్తోంది.
సరికొత్త తరహాలో నిర్వహించే బిగ్ గోల్డెన్ వాయిస్ సీజన్ 2లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన బిగ్ గోల్డెన్ వాయిస్ ను ఎంపిక చేసేందుకు బిగ్ ఎఫ్ఎం ఔత్సాహిక గాయనీ గాయకులకు ఆహ్వానించింది. పేర్లను నమోదు చేసుకున్న పోటీదార్లకు ఆడిషన్లు ఐవిఆర్ఎస్ ద్వారా నిర్వహించారు.

బిగ్ బిగ్ 01
ప్రముఖ గాయని సునీత పోటీదార్లలో 6 అద్భుతమైన గళాలలను ఫైనల్స్ కు ఎంపిక చేసారు. ఎంపికైన ఆరుగురిలో నందిత, అనూష, సుధీర, నరసింహ, సుహిత, మౌనికలు ఉన్నారు.

బిగ్ బిగ్ 02
వీరిలో ఒకరు హైదరాబాద్ నుండి బాలీవుడ్లో పాడే అవకాశం కోసం జాతీయ ప్లాట్ ఫాంపై మిగతా ప్రాంతాల విజేతలతో పోటీ పడనున్నారు. ఈ ఆరుగురిలో జరిగిన పోటీలో సహిత హైదరాబాద్ ఫినాలే విజేతగా నిలిచి బాలీవుడ్లో పాడే అవకాశం కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

బిగ్ బిగ్ 03
బిగ్ ఎఫ్ఎం జాతీయ బిజినెస్ హెడ్, అశ్విన్ పద్మనాభన్ మాట్లాడుతూ సీజన్ 1లో వారు నిర్వహించిన కార్యక్రమానికి శ్రోతల నుండి వచ్చిన స్పందనను చూసి సీజన్ 2ను నిర్వహించినట్లు చెప్పారు. సీజన్ 2లో సరికొత్త లెవెల్స్‌తో ఈ షోను మరింత జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. ఈ సీజన్ లో కొత్త ఫార్మాట్ తో దేశ వ్యాప్తంగా ఉన్న 44 రేడియో స్టేషన్ల ద్వారా స్థానిక ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం కల్పించి బాలీవుడ్లో నేపథ్యగానం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారని అన్నారు.

బిగ్ బిగ్ 04
బిగ్ గోల్డెన్ వాయిస్ ఆఖరి రౌండ్ ఆగస్టు 1న వెస్లీ కాలేజీలో నిర్వహించబడింది. సింగర్ సునీత ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి సుహితను హైదరాబాద్ ఫైనలిస్టుగా నిర్ణయించారు. ఫినాలెలో మూడు రౌండ్లు జరిగాయి. ఫినాలె తర్వాత ఫైనలిస్టులను అవార్డును ప్రకటించే రోజు సాయంత్రం జరిగే షోలో భాగస్తులను చేస్తారు.


Click it and Unblock the Notifications