మాస్ మహారాజ క్రేజ్ కు ఇదే నిదర్శనం.. ధర పేలిందిగా
టచ్ చేసి చూడు చిత్రం నిరాశ పరచడంతో రవితేజ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. రవితేజ ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే బిజినెస్ అదిరిపోయింది. భారీ ధరకు ఈ చిత్ర హక్కులు అమ్ముడవడంతో తాజాగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వరుస పరాజయాలు
రవితేజకు ఈ మధ్య కాలంలో రాజా ది గ్రేట్ మాత్రమే చప్పుకోదగ్గ చిత్రం. మిగిలి చిత్రాలు నిరాశ పరుస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రవితేజ మార్కెట్ కు గండి పడుతోందని కామెంట్లు వినిపిస్తూ వచ్చాయి.

నేల టికెట్ తో రాబోతున్నాడు
రవి తేజ ఈ దసరాకు కళ్యాణ్ కృష్ణ చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి నెల టికెట్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

షాక్ ఇచ్చిన బిజినెస్
ఈ చిత్ర హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కులకు ఇంకా బిజినెస్ మొదలు కాలేదు, కానీ శాటిలైట్, డబ్బింగ్ మరియు డిజిటల్ హక్కులని ప్రముఖ సంస్థ సన్ నెట్ వర్క్ రూ 25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రవితేజ సత్తా అది
రూ 25 కోట్ల ధర అంటే నిర్మాతకు థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోకముందే లాభాల బాట పట్టినట్లు అయింది. రవితేజ మార్కెట్ పడిపోయిందని కామెంట్ చేసే వారికి ఇదే సమాధానం అని సినీ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











