గీతా ఆర్ట్స్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్.. తమిళ్, బాలీవుడ్ హీరోలతో కూడా..
గీతా ఆర్ట్స్ మెయిన్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ చివరిగా అల.. వైకుంఠపురములో మూవీ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే గీతా ఆర్ట్స్ 2లో మాత్రం ప్రతి సంవత్సరం ఒకటి, రెండు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక అల్లు అరవింద్ వేరే నిర్మాతలతో కలిసి ఇంకో ప్రొడక్షన్ హౌస్ పేరుతో హిందీలో జెర్సీ, సెహజాదా మూవీస్ నిర్మించారు.
అయితే మెయిన్ బ్యానర్ లో మరల ఇప్పుడు యాక్టివ్ గా సినిమాలు చేయడానికి అల్లు అరవింద్ సిద్ధం అవుతున్నారు. తాజాగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాల జాబితా చూసుకుంటే వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు ఉందని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ ఉండబోతోందని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం దర్శకుడు కథపైన వర్క్ చేస్తున్నారంట. ఈ చిత్రం అల్లు అర్జున్ తో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ ఉండనుంది. ఈ సినిమాని బాలయ్యతో చేసే ఛాన్స్ ఉందంట. అలాగే మరో స్టార్ హీరో పేరు కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో ఏకంగా రెండు సినిమాలు కమిట్ అయ్యారంట.
అందులో ఒక మూవీ నాగ చైతన్య హీరోగా తెరకెక్కనుంది. త్వరలో ఈ మూవీ స్టార్ట్ కావొచ్చు. దీని తర్వాత తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. చందూ మొండేటి ఇప్పటికే కథ కూడా హీరో సూర్యకి నేరేట్ చేయడం జరిగిందంట. ఇది కాకుండా బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో కార్తిక్ ఆర్యన్ తో చందూ మొండేటి దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నారంట. అలాగే రామ్ చరణ్ తో ఒక సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ బుచ్చిబాబు మూవీ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా మురుగదాస్ తో చాలా ఏళ్ల క్రితమే కమిట్మెంట్ అయ్యింది. అల్లు అర్జున్ తో మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట.


Click it and Unblock the Notifications











