‘దూకుడు’ అర్థశతదినోత్సం వెనుక సీక్రెట్ ఏంటి...!?

By Sindhu

ఈమధ్య కాలంలో మంచి విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకున్న 'దూకుడు' సినిమా కలక్షన్లలో ఇంకా దూకుడు మీదే వుంది. ఏభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం అర్ధశతదినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 12 సాయంకాలం విజయవాడ నగరంలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ వేడుక జరుగుతుంది. కథానాయకుడు మహేష్ బాబు, కథానాయిక సమంతా, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఘట్టమనేని అభిమానులతో పాటు మరి కొంత మంది ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం వుంది.

ఆ ప్రముఖులు ఎవరంటే వెంకటేష్, పూరి జగన్నాథ్, ప్రభాస్, కష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, సుకుమార్, దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల, కెయల్ నారాయణ, జెమిని కిరణ్, అచ్చిరెడ్డి, వెంకట్, వల్లభనేని వంశీ మోహన్, బెల్లంకొండ సురేష్, సుధీర్ బాబు, మంజుల, రాఘవేంద్రరావు, వీళ్ళతో పాటు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ని బయ్యర్స్ ని కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో విజయవాడలో ఏ సినిమా వేడుక జరగనంత భారీ ఎత్తున ఈ 'దూకుడు" అర్థశతదినోత్సవ వేడుకను జరపడానికి నిర్మాతలు సర్వసన్నాహాలు చేస్తున్నారట.

ఇదిలా ఉంటే కొంతమంది సినీ విమర్శకలు మాత్రం దూకడు అర్థ శతదినోత్సవం ఇంత గ్రాండ్ గా జరపడం వెనుక ఏదో సీక్రెట్ ఉందంటున్నారు. ఎన్నడూ లేని మహేష్ బాబు కొత్తగా ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటున్నారు. ఇందంతా చూస్తుంటే దూకుడు యూనిట్ టార్గెట్ అంతా మగధీర కలెక్షన్స్ పైనే అంటున్నారు. మహేష్ బాబు మగధీరని బీట్ చేసిందని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తెలిసిందే. అయితే అధికారికంగా కలెక్షన్స్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశమేమన్నా ఉందేమో అని అంటున్నారు. అయితే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మగధీర ని బీట్ చేయలేదని తెలియజేయడం తెలిసిందే. ఏదైతేనేం దూకుడు ఆడియో ఫంక్షన్ లో మగధీరను బ్రేక్ చేసిందో లేదో అన్న అంశంతో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలి, తెలియనున్నాయని ఫిల్మిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X