»   » "రంగస్థలం" కోసమే ఆ భారీ సెట్: ఇక హైదరాబాద్ వచ్చేస్తారట

"రంగస్థలం" కోసమే ఆ భారీ సెట్: ఇక హైదరాబాద్ వచ్చేస్తారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం 'రంగస్థలం' సినిమా షూటింగులో సుకుమార్ బిజీగా వున్నాడు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆయన గోదావరి తీరంలో చిత్రీకరిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సహజత్వం కోసం గ్రామీణ ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తూ వస్తున్నారు.

రాజమండ్రి సమీపంలోని గోదావరి తీరంలో కొన్ని రోజులుగా'రంగస్థలం 1985' కోసం రామ్‌చ‌ర‌ణ్‌ పై చిత్రీకరణ జరుపుతున్నారు. ప్ర‌స్తుతం వాన‌లు జోరుగా కురుస్తుండ‌డంతో వాటిని కూడా ఉప‌యోగించుకుంటున్నాడ‌ట డైరెక్ట‌ర్ సుకుమార్. అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ కారణంగా చరణ్ గాయపడుతున్నప్పటికీ, అలాంటివేమీ లెక్కచేయకుండా రామ్‌ చరణ షూటింగ్‌ కార్య క్రమాలను కొనసాగిస్తున్నారంటూ చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తోంది.


 Big set in hyderabad for Rangasthalam

ఈ నెలాఖరు తర్వాత హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. అక్కడ చిత్రీకరించడానికి కుదరని సన్నివేశాల కోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. 1985 కాలం నాటి వాతావరణం ప్రతిబింబించేలా ఆ కాలం నాటి అరుగులతో కూడిన ఇళ్లు .. వీధుల సెట్టింగ్స్ ను రెడీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పల్లెటూరి సెట్లోనే షూటింగ్ చేయనున్నారు. జాలరి కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో చరణ్ కనిపించనుండటం విశేషం.


English summary
Ram chahra's Rangasthalam shooting is going on at Rajamandry, a latest update about this movie., A Huge set is getting ready for this movie in hyderabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu