జూ ఎన్టీఆర్ తన ‘శక్తి’సామర్థ్యాలను మరోసారి...
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం శక్తి. ఇలియాన కథానాయిక. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలె హంపి, బదామిలో చిత్రీకరణ పూర్తియింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైద్రాబాద్ లో మరో షెడ్యూల్ వుంటుంది. ఇప్పుడు 'శక్తి'లో ఎన్టీఆర్‌ని మరింత కొత్తగా చూపించనున్నారు. యాక్షన్‌కి పెద్దపీట వేసిన చిత్రమిది. ఈ సినిమా కోసం హైద్రాబాద్ శివార్లలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. అక్కడ పతాక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా కంత్రి తరువాత మెహర్ రమేష్, జూ ఎన్టీఆర్ ల కాంభినేషన్ లో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ, ఇటు సినీ వర్గాలలోను భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పూజాబేడి 'శక్తి" చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











