సెట్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్
హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో ఉన్నాడు పవన్. ఈ ఎన్నికల హడావుడి పూర్తవ్వడమే ఆలస్యం. పవన్‌కల్యాణ్ సరాసరి కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 'ఓ మై గాడ్' రీమేక్ సినిమా కోసం ఆయన కాల్‌షీట్లు కేటాయించినట్టు సమాచారం. మే నెలాఖరున షూటింగ్ మొదలవుతుంది. దీనికోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే ఎక్కువ భాగం సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ సెట్ ఓ మార్కెట్ సెట్. కథలో ఎక్కువ భాగం మార్కెట్ లో జరుగుతుంది కాబట్టి ఆ మార్కెట్ నే బాగా డిజైన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్‌తో పాటు వెంకటేష్ కూడా నటిస్తారు. హిందీలో అక్షయ్‌కుమార్, పరేష్ రావల్ నటించిన 'ఓ మైగాడ్' విజయవంతమైంది. అదే చిత్రాన్ని ఇక్కడ పవన్, వెంకటేష్‌లపై తీస్తున్నారు. అక్కడ అక్షయ్ పోషించిన పాత్రలో పవన్, పరేష్ రావల్ పాత్రలో వెంకటేష్ నటిస్తారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తొలుత నయనతారని అనుకొన్నారు కానీ... ఆ ఛాన్స్ రాధిక చేజిక్కించుకొన్నట్టు తెలిసింది. వెంకటేష్ సరసన ఆమె చేయనుంది.

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్'. 'మేన్ హూ స్యూడ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి పురాతన వస్తువులు అమ్మే షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.


Click it and Unblock the Notifications











