»   »  రంగస్థలంలో ఆ ఒక్కటీ దాచేశారు..అదిరిపోవడం ఖాయం!

రంగస్థలంలో ఆ ఒక్కటీ దాచేశారు..అదిరిపోవడం ఖాయం!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ విడుదలకు అంతా సిద్ధం అయింది. మరి కొన్ని గంటల్లోనే ఈ చిత్ర షోలు ప్రారంభం కానున్నాయి. రంగస్థలం చిత్రం చరణ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని అంచనాలు మొదలయ్యాయి. మెగా అభిమానులు, ప్రేక్షకులు మరియు సినీవర్గాలు రంగస్థలం చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు మరి కొన్ని గంటల్లోనే తెరపడనుంది.

Big surprise for mega fans from Rangasthalam movie team.

రంగస్థలం చిత్ర సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లుగా దేవిశ్రీ ఈ చిత్రానికి అదిరిపోయే ఆల్బమ్ అందించారు. చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలోని ఐదు పాటలని విడుదల చేసారు. అభిమానులని సర్ప్రైజ్ చేసేలా ఈ చిత్రంలో ఆరవ పాట కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూ లో దేవిశ్రీ ఈ విషయాన్ని వెల్లడించాడు కూడా. ఆ సాంగ్ ని రహస్యంగా ఉంచారంటే థియేటర్ లో అదిరిపోవడం ఖాయం అని అంటున్నారు. ఆ పాటని మరో కొద్ది గంటల్లోనే ఎంజాయ్ చేయడానికి మెగా అభిమానులు సిద్ధం అవుతున్నారు.

English summary
Big surprise for mega fans from Rangasthalam movie team. Rangasthalam movie will going to release in few hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X