'బావ' క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావుదే...సిద్దార్ద
సిద్దార్ద తాజా చిత్రం బావ చిత్రం గురించి రీసెంట్ గా ట్విట్టర్ లో..."బావ కలెక్షన్స్ రూరల్ ఏరియోలో అద్భుతంగా ఉన్నాయి. నా కెరీర్ లో మెదటిసారి ఆ ఏరియాల్లో కలెక్షన్స్ రావటం..ఈ సందర్భంగా రాఘవేంద్రరావుగారికి బిగ్ ధాంక్స్..ఆయనే నన్ను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమి చేయమని ప్రేరేపించారు" అంటూ ట్వీట్ చేసారు. ఇక బావ విడుదలైన మొదటి ఆటకే ప్లాప్ టాక్ తెచ్చుకంది. అయితే ఇప్పటికీ సిద్దార్ధ ప్రతీపూటా పనిగట్టుకుని మరీ ఈ చిత్రం అధ్బుతం..సూపర్ కలెక్షన్స్...ఈ రేంజి నేను ఊహించలేదు అంటూ ప్రమోట్ చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్, సిద్దార్ధ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ద్వారా రాంబాబు అనే నూతన దర్శకుడు పరిచయమయ్యాడు. అలాగే ఈ చిత్రంలో ఏం పిల్లో..ఏం పిల్లడో ఫేమ్ ప్రణీత హీరోయిన్ గా చేసింది. మొన్న శుక్రవారం విడుదలైన సిద్దార్ద తాజా చిత్రం బావ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దారుణ ప్లాప్ కి కారణం సిద్దార్ద ప్రవర్తనేనని ఇండస్ట్రీలో వినపడుతోంది. సిద్దార్ద ఈ చిత్రం మొదలైన దగ్గరనుండీ దర్శకుడుని ప్రక్కన పెడుతూ ప్రతీ విషయంలో వేలు పెడుతూ వచ్చాడని, ఎవరినీ వారి పని వారు చేసుకోనివ్వలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











