Mr.Pregnant Trailer Review: ప్రెగ్నెంట్ అయిన సోహెల్... నవ్విస్తూనే ఏడిపించేశాడుగా!

బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ ఈ మధ్య కాలంలో హీరోగా మారి సినిమాలు తీస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇక చివరగా అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చిన సొహెల్.. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

సొహెల్... బిగ్ బాస్ కు ముందు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తుండే వాడు. మొదటగా కొత్తబంగారు లోకంలో కనిపించిన సొహెల్ ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించాడు. ఇక యురేక అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ తోనే సొహెల్ కు మంచి పేరును, పాపులారిటీని తీసుకువచ్చాయి. ఇక ఆ తర్వాత హీరోగా మారి.. మరిన్ని సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Mr.Pregnant

2022లో లక్కీ లక్ష్మణ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సొహెల్.. ఆ తర్వాత 2023లో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత బూట్ కట్ బాలరాజు అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సొహెల్ ఏ ప్రొడ్యూసర్ అవ్వడం విశేషం. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్.

మిస్టర్ ప్రెగ్నెంటో ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఇక ఈ మూవీకి శ్రీనివాస్ వింజ‌నంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇందులో సోహెల్‌కు జోడీగా రూప హీరోయిన్‌ గా న‌టిస్తోంది. ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌ రూప‌స్య సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది రూప. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 4 నుంచి సోహెల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ మూవీ మొద‌లైనప్పటికీ... అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ చాలా ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు అనౌన్స్‌చేసిన మూడేళ్ల త‌ర్వాత ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. . ఇక ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ ను అక్కినేని నాగార్జున రిలిజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నా పేరు గౌతమ్. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల ఫ్రెండు అంటూ ట్రైలర్ స్టార్ అవుతుంది. ఇక ఇది అందరి లైఫ్ లో ఉండేదే బ్రో.. కానీ నా లైఫ్ లో ఓ ట్విస్ట్ అంటూ సొహెల్ చెప్తాడు. ఇంతలోనే హి ఇజ్ మిస్టర్ ప్రెగ్నెంట్ అని సుహసిని చెబుతుంది. దీనితో సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. హీరో ప్రెగ్నెంట్ అవుతాడని...!

మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ గమనిస్తే.. మహిళకు ఏ విధంగా అయితే సమస్యలు వస్తాయో.. సొహెల్ కు కూడా అలాగే ఉంటాయి. అలా ట్రైలర్ మొదట్లో నవ్విస్తూ సాగింది. ఇక సడెన్ గా ఎమోషనల్ వైపు తీసుకువెళ్తాడు దర్శకుడు. మేల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో.. సొసైటీ ఎలా చూస్తుంది.. ఎలా అవమానిస్తుంది అనేది ఇందులో చూపించారు. ఇక ఎవరూ ఏం అనుకున్న బేబీ కోసం సొహెల్ కష్టపడటం, బాధపడటం కనిపిస్తుంది.. చివరగా సొహెల్ తన యాక్టింగ్ తో ఏడిపించేస్తాడు. నీకు ఏం కాదు.. నేనున్నాను అని బేబీతో చెప్పే డైలగ్.. మనసులను కలిచివేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X