Suresh Kondeti: సురేష్ కొండేటికి నరకం చూపించిన సోహెల్... అలా పెట్టి మరీ హింసించాడుగా!

టాలీవుడ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పేరు ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ అయిపోయారు. ఎక్కడా చూసిన ఆయన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. దానికి కారణం ఆయన సినిమా ప్రెస్ మీట్ లో అడిగే ప్రశ్నలు. ఏది ఏమైనా ఆయన మాత్రం ఓ స్టార్ సెలబ్రెటీకి ఉన్న క్రేజ్ అయితే కొట్టేశారు. అయితే హీరో సోహెల్.. జర్నలిస్టు సురేష్ కొండేటికి చుక్కులు చూపించారట. ఓ మిషన్ పెట్టి మరి హింసించారట. అదేంటో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో పుట్టి పెరిగిన సురేష్ కొండేటి... హైదరాబాద్ వచ్చి జర్నలిస్టుగా సెటిల్ అయిపోయారు. జర్నలిస్టుగా ఉన్న పరిచయాలతో డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా మారి బాగానే వెనకేసుకున్నారు. ఇక సంతోషం మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా పని చేసి... సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమా పేరునే ఒక పత్రికకు పెట్టి ఒక సినీ వారపత్రికను నడుపుతున్నారు.

 Sohel

సురేష్ కొండేటి ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలను నటినటులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ... ట్రెండింగ్ స్టార్ అయిపోయారు. ఇక ఆయన ఏ ప్రెస్ మీట్ కు వెళ్లిన.. హీరోలు, హీరోయిన్లు ముందుగానే అలర్ట్ అయి.. సమాధానాలు ఆచితూచి చెప్పాల్సి వస్తోంది. దీంతో ఆయనకు కాంట్రవర్సీ జర్నలిస్టుగా పేరు పడిపోయింది. ఏదీ ఏమైనా సురేష్ కొండేటికి మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అయితే లభించింది.

 Sohel

ఇక సోహెల్ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ పతాకంపై దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఉల్టా పల్టా సాంగ్ ను మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ కొండేటిని సోహేల్ హింసించాడు.

మిస్టర్ ప్రెగ్నెంట్ స్టోరీ ఇప్పటికే అందరికీ అర్థం అయి ఉంటుంది. ఓ మేల్ పర్సన్ ప్రెగ్నెంట్ అవుతాడు. అయితే ఆ నొప్పులు ఎలా ఉంటాయో.. చూపించేందుకు ఈ కార్యక్రమంలో ఓ మిషన్ తీసుకువచ్చారు. దీనితో రియల్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ ను పుట్టేలా చేయవచ్చు. అది మగవారికి అర్థం అయ్యేందుకు అలా మిషన్ వైర్లను నడుముకు చుట్టి పెడతారు అనమాట. అయితే ఈ మిషన్.. అక్కడికి వచ్చిన సురేష్ కొండేటిపై ప్రయోగించారు.

 Sohel

ఇక ఆ నొప్పులను భరించలేక సురేష్ కొండేటి.. అరవడం ప్రారంభించారు. ఇక అక్కడి మీడియా ప్రతినిధులు సురేష్ కొండేటిని కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. మీకు ఎన్నో నెల అని అడగ్గా.. ఆరో నెల అంటూ సమాధానం చెప్పారు. ఇక సురేష్ కొండేటి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగారు. దానికి ఆయన.. సోహెల్ అంటూ నవ్వించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక సురేష్ కొండేటి విషయానికి వస్తే.. త్వరలో ఆయన బిగ్ బాస్ షో లో కూడా సందడి చేయనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X