twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపింది.. అంతా ఎన్టీఆర్ మహిమేనా?: గూగుల్ సెర్చ్‌లో 'బిగ్ బాస్' ర్యాంక్ ఇది..

    |

    Recommended Video

    'బిగ్ బాస్' దుమ్మురేపింది..!

    'బిగ్ బాస్' షో తెలుగులో మొదలైనప్పుడు ఎన్నో సందేహాలు. అసలు ఇలాంటి షో తెలుగులో సక్సెస్ అవుతుందా? అన్న ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. మధ్యలో షో శ్రుతిమించుతోందన్న విమర్శలూ వచ్చాయి.

    కానీ బుల్లి తెరపై ఈ షో విజయవంతంగా మొదటి సీజన్ పూర్తి చేసుకుంది. షో మొదలైన కొన్ని రోజులకు రేటింగ్స్ గాడి తప్పుతున్నట్లే అనిపించినా.. ఆ తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. మొత్తంగా ఎక్కువమంది వీక్షకులను కట్టిపడేసిన 'షో'గా బుల్లి తెరపై బిగ్ బాస్ ఆదరాభిమానాలను చూరగొంది. తాజాగా గూగుల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

    'బిగ్ బాస్' మరీ ఇంత దారుణమా?: గతిలేక రాలేదంటూ శివబాలాజీ ఫైర్'బిగ్ బాస్' మరీ ఇంత దారుణమా?: గతిలేక రాలేదంటూ శివబాలాజీ ఫైర్

     టాప్ సెర్చెస్‌లో:

    టాప్ సెర్చెస్‌లో:

    2017లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అత్యధిక మంది వెతికిన టీవి షోల్లో తెలుగు 'బిగ్ బాస్' ఆరో స్థానం సాధించింది. జులై నుంచి ఆగస్టు మధ్య ఈ షో కోసం ఎక్కువమంది గూగుల్ లో సెర్చ్ చేశారట.

     జూనియర్ బిగ్ ప్లస్:

    జూనియర్ బిగ్ ప్లస్:

    బిగ్ బాస్ షో కు జూనియర్ ఎన్టీఆరే పెద్ద బలం అన్నది చాలామంది వాదన. షో పట్ల అటెన్షన్ క్రియేట్ చేయడంలోను.. ఆసాంతం తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంలోను.. వాక్చాతుర్యంలోను ఎన్టీఆర్ షోకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. షో కి ట్రాఫిక్ క్రియేట్ చేయడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి.

     మళ్లీ పుంజుకుని:

    మళ్లీ పుంజుకుని:

    బిగ్ బాస్ షో ప్రారంభంలో జనాలు ఆసక్తిగా వీక్షించారు. కానీ రాను రాను.. షో లో ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది. దానికి తోడు షో లో సభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా బిగ్ బాస్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. షో కొనసాగినన్ని రోజులు చాలామంది ఆసక్తిగా వీక్షించారు.

     విన్నర్ శివబాలాజీ:

    విన్నర్ శివబాలాజీ:

    ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్ ఫైనల్లో చివరకు శివబాలాజీని విజయం వరించిన సంగతి తెలిసిందే. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్‌తో పాటు 50 లక్షల ఫ్రైజ్ మనీ గెల్చుకున్నారు. ఫైనల్లో శివబాలాజీ, ఆదర్శ్ ఇద్దరు మాత్రమే పోటీలో నిలవగా.. ఓటింగ్ ఆధారంగా శివబాలాజీని విన్నర్ గా నిర్ణయించారు. ఈ ఓటింగ్ కూడా గూగుల్ ద్వారానే జరిగిన సంగతి తెలిసిందే.

    English summary
    Bigboss telugu show listed in most searched tv shows in 2017 google top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X