క్రికెటర్‌తో శృంగారం పచ్చి అబద్దం, ఆల్రెడీ పెళ్లయింది, 10 కేసులు కూడా...?

హిందీ బిగ్ బాస్ 11 షో మీద అనేక వివాదాలు ముసుకుంటున్నాయి. తాజాగా అర్షి ఖాన్ వివాదం హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ షోలో అవకాశం కోసం అర్షి ఖాన్ చెప్పిన విషయాలన్నీ పచ్చి అబద్దాలే అని మరో మోడల్ గెహానా వశిష

By Bojja Kumar

హిందీ బిగ్‌బాస్ సీజన్ 11లో నటి, మోడల్ అర్షి ఖాన్ పేరు బిగ్ బాస్ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా మారుమ్రోగి పోతోంది. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శంగారంలో పల్గొన్నాను అంటూ గతంలో సంచలన ప్రకటన చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Recommended Video

హీరోయిన్ సెమీ న్యూడ్ మసాజ్ వీడియో.. ఇంటర్నెట్లో వైరల్..

తాజాగా అర్షి ఖాన్ మీద మరో మోడల్ గెహానా వశిష్ఠ్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు అర్షి ఖాన్ చెప్పినవన్నీ అబద్దాలే అని, బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఆమె ఇచ్చిన వివరాలు కూడా తప్పుడు వివరాలే అంటూ గెహానా వశిష్ఠ్ తెలిపారు.

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది

అర్షి ఖాన్ తన వయసు 27 మాత్రమే అని, తనకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పుకుంటోందని.... అదంతా పచ్చి అబద్దమే అని, ఆమె వయసు 32 సంవత్సరాలని, 50 ఏళ్ల వ్యక్తితో ఆమెకు ఆల్రెడీ పెళ్లయిందని గెహానా వశిష్ఠ్ తెలిపారు.

అర్షి ఖాన్ బండారం మొత్తం తెలుసు

అర్షి ఖాన్ బండారం మొత్తం తెలుసు

భూపాల్‌లో స్కూల్‌ డేస్ నుంచి తనకు అర్షి ఖాన్ తనకు తెలుసని, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలన్నీ తాను కశ్చితంగా చెప్పగలుగుతున్నాను అని, బిగ్‌బాస్‌ 11లో పాల్గొనేందుకు తన విద్యార్హత వివరాలు కూడా తప్పుగా చెప్పిందన్నారు.

క్రికెటర్‌తో ఆమెకు పరిచయం లేదు

క్రికెటర్‌తో ఆమెకు పరిచయం లేదు

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే అర్షి ఖాన్ ఇవన్నీ చెప్పుకుంటోందని.... గెహానా వశిష్ఠ్ తెలిపారు.

పది క్రిమినల్ కేసులున్నాయి

పది క్రిమినల్ కేసులున్నాయి

ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో భారత్‌, పాకిస్తాన్‌ జెండాలను అవమానించిన కేసులు కూడా ఉన్నాయని గెహానా వశిష్ఠ్ ఆరోపించారు. తన నగ్న శరీరం మీద ఆ జెండాలను పేయింటింగ్ వేసుకుందని గెహానా వశిష్ఠ్ తెలిపారు.

అబద్దాలకోరు, బిగ్ బాస్ షోకు ఎలా ఎంపికయిందో?

అబద్దాలకోరు, బిగ్ బాస్ షోకు ఎలా ఎంపికయిందో?

ఎలాంటి బ్యాగ్రౌండ్ వేరిఫికేషన్ లేకుండా, క్రిమినల్ కేసులు ఉన్న ఒక అబద్దాల కోరును బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలా ఎంపిక చేశారో తనకు అర్థం కావడం లేదని, దీని వల్ల ఆ షోకు చెడ్డ పేరు రావడం మినహా మరేమీ లేదన్నారు గెహానా వశిష్ఠ్.

బిగ్ బాస్ 11 షో మీద అనేక వివాదాలు

బిగ్ బాస్ 11 షో మీద అనేక వివాదాలు

బిగ్ బాస్ 11 షో మీద ఇప్పటికే అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ షోలో పోటీదారుగా ఉన్న జుబీర్ ఖాన్... దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ తో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆకాష్ దల్దానీ ఫాల్స్ రిలేషన్‌షిప్ విత్ మ్యూజిక్ కంపోజర్ విశాల్ దల్దానీ... ఇపుడు అర్షి ఖాన్ వివాదం తెరపైకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X