ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగ్‌బాస్ సంజన.. పోటీ ఎక్కడి నుంచో తెలుసా!

Recommended Video

Bigg Boss 2 Contestant Sanjana To Compete In AP Assembly Election | Filmibeat Telugu

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 2 షోలో సంజన కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే సంజన ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చి బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలతో మరింతగా పాపులర్ అయింది. షోలో ఉన్నన్ని రోజులు అందరితో గొడవపడుతూ దూకుడు స్వభావం కనబరిచింది. ఈ ప్రవర్తన కారణంగానే ఆమె ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం సంజన మరోమారు వార్తల్లో నిలిచింది.

త్వరలో ఎన్నికలు

త్వరలో ఎన్నికలు

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ప్రధాన ఆకర్షణగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది సినీతారలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. హీరోయిన్ మాధవి లత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సంజన కూడా ఎన్నికల బరిలో నిలిచింది.

నూజివీడు నియోజకవర్గం నుంచి

నూజివీడు నియోజకవర్గం నుంచి

సంజన ఇటీవల నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది. సంజన సొంత ఊరు నూజివీడుకు దగ్గర్లోని కృష్ణవరం గ్రామం. సంజన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. తర్వాత బిగ్ బాస్ అవకాశం ఆమె తలుపు తట్టింది. రాజకీయాలపై ఆసక్తితో సంజన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం.

మిస్ హైదరాబాద్

మిస్ హైదరాబాద్

సంజన మోడలింగ్ లో కూడా తనదైన ముద్ర వేసింది. 2016లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత జాగృతి పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరుపున నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంజన గట్టి ప్రయత్నమే చేసిందట. కానీ టికెట్ దక్కక పోవడంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది.

పొలిటికల్ బ్యాగ్రౌండ్

పొలిటికల్ బ్యాగ్రౌండ్

సంజనకు అసలు ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేదు అనుకుంటే పొరపాటే. సంజన అసలు పేరు అన్నే వనజ. దివంగత మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావుకు సంజన సమీప బంధువు. రాజకీయాలపై ఎంతోకొంత పరిజ్ఞానం ఉంది కాబట్టే సంజన ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎన్నికల తర్వాత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా లేక సీరియస్ గా దృష్టి పెడుతుందా అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X