twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నాని నాకు నచ్చలా.. ఎన్టీఆర్ ఎన్టీఆరే, బిగ్ బాస్ జోలికే వెళ్ళను.. సంజన!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu: Sanjana Anne Sensational Comments On Nani

    బిగ్ బాస్ 2 సీజన్ జోష్ గా కొనసాగుతోంది. అప్పుడే ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ 2 హౌస్ లోకి అడుగుపెట్టిన సంజన అందరికంటే ముందుగా హౌస్ నుంచి ఎలిమినేటి అయింది. సంజన స్థానంలో కొత్త బ్యూటీ నందిని రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుపెట్టబోతుండడం విశేషం. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేవిధంగా హౌస్ లో ప్రయత్నిస్తున్నారు. హోస్ నుంచి బయటకు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

    నాని నాకు నచ్చలా

    నాని నాకు నచ్చలా

    బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని తనకు నచ్చలేదని సంజన తెలిపింది. తాను ఎన్టీఆర్ అభిమానిని కాబట్టి అలా అనిపించిందేమో అని సంజన తెలిపింది. కానీ నాని ఊహించినంతగా అంచనాలు అందుకోలేదని తెలిపింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ వ్యాఖ్యానించింది.

    బిగ్ బాస్ జోలికే వెళ్లను

    బిగ్ బాస్ జోలికే వెళ్లను

    బిగ్ బాస్ 3 లో ఛాన్స్ వస్తే చేస్తారా అనే ప్రశ్నకు సంజన ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇక భవిష్యత్తులో బిగ్ బాస్ జోలికే వెళ్లనని సంజన తెలిపింది. బిగ్ బాస్ 2 పట్ల ఆమె నిరాశ వ్యక్తం చేసింది.

    రెమ్యునరేషన్ లేదు

    రెమ్యునరేషన్ లేదు

    తనతో పాటు సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన నూతన నాయుడు, గణేష్ కు రెమ్యునరేషన్ ఇవ్వలేదని సంజన వ్యాఖ్యానించింది. బిగ్ బాస్ తమకు ఓ ఫ్లాట్ ఫామ్ అని నిర్వాహకులు భావించడమే అందుకు కారణం అని సంజన తెలిపింది.

    బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే

    బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే

    తాను బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే ఓ వృద్ధాశ్రమం నిర్మించి ఉండేదానిని అని సంజన తెలిపింది. మొత్తానికి సంజన ఎలిమినేషన్ తో బిగ్ బాస్ 2 మరింత రసవత్తరంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    English summary
    Bigg Boss 2 Contestant Sanjana Sensational Comments On Nani. Sanjana also comments on remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X