For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సంజన!

  By Bojja Kumar
  |

  బిగ్ బాస్ 2 రెండో సీజన్ జూన్ 10న నాని హోస్ట్‌గా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ షోలో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్ కేటగిరీలో విజయవాడకు చెందిన సంజన అనే మోడల్ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షోకు రావడానికి కొన్ని రోజుల ముందు సంజన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. 2016 నుండి తాను మోడలింగ్ చేస్తున్నానని, నన్ను చూసిన ఓ డైరెక్టర్ సినిమా అవకాశం ఇప్పిస్తానని పిలిచాడని, అయితే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తానని అన్నాడని తెలిపారు.

  సినిమా ఛాన్స్ అని చెప్పి పిలిచాడు

  సినిమా ఛాన్స్ అని చెప్పి పిలిచాడు

  ఒక డైరెక్టర్ నన్ను తన సినిమాలో హీరోయిన్ గా అడిగాడు. ఓసారి నన్ను పిలిచి ‘నా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం. అందులో ఒకరిగా నిన్ను తీసుకోవాలనుకుంటున్నాం. ఒకసారి నీ ఫోటోస్ పంపించు అన్నాడు. పంపిన తర్వాత ఇండస్ట్రీ గురించి నీకు తెలుసుకదమ్మా అన్నారు. తెలుసు సార్ అన్నాను. నీకు ఎ టూ జెడ్ మొత్తం తెలుసు కదమ్మా... నేను నీకు డేట్స్ చెబుతాను, ఆ డేట్స్ లో నువ్వు మాకు అందుబాటులో ఉండాలి, షూటింగుకు అవాయిలబుల్ గా ఉండాలి అన్నాను. అతడు చెప్పిన మాటల్లో అసలు అర్థం నాకు అపుడు అర్థం కాలేదు.... అని సంజన తెలిపారు.

  Bigg Boss 2 Telugu : Common Celebrity Sanjana Anne Quarrel With Other Celebrities
  చెప్పుతో కొడతాను అని చెప్పా

  చెప్పుతో కొడతాను అని చెప్పా

  ఆయన చెప్పిన మాటల్లో అసలు విషయం నాకు అప్పటికీ అర్థం కాక.... మీకెందుకు అవాయిలబుల్‌గా ఉండాలి సార్ అన్నాను. మరీ మీకు వివరించి అరటిపండు ఒలిచి తినిపించినట్లు ఎలా చెబుతామమ్మా, నువ్వే అర్ధం చేసుకోవాలి? చిన్న పిల్లవు కావుకదా అన్నారు. అప్పటికీ నాకు అర్థం కాలేదు అన్నాను. దానికి అతడు నీకు ఇంతకు మించి వివరంగా చెప్పలేను. తెలుసుకుని నువ్వే ఫోన్ చేయి అన్నాడు. తర్వాత నా స్నేహితులను కనుక్కుంటే.... దాని అర్థం సెక్సువల్ కమిట్మెంట్ ఇవ్వడం అని చెప్పారు. వెంటనే అతడికి ‘చెప్పుతో కోడతాను' అని మెసేజ్ పెట్టాను అని సంజన వెల్లడించారు.

  కొరకడానికి ట్రై చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాను

  కొరకడానికి ట్రై చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాను

  ఆ డైరెక్టర్ మాటల్లో అర్థం తెలిసిన తర్వాత మామూలుగా ఉండలేక పోయాను. మళ్లీ నా పట్ల అలా ప్రవర్తిస్తే మామూలుగా ఉండను, నేను మిరపకాయలాంటి దాన్ని, నన్ను కొరకడానికి ట్రై చేయకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను... అని సంజన తెలిపారు.

  అన్నయ్య, అక్కను తీసుకెళ్లడంతో కోపం వచ్చింది

  అన్నయ్య, అక్కను తీసుకెళ్లడంతో కోపం వచ్చింది

  కొన్ని రోజుల తర్వత మళ్లీ ఆ డైరెక్టర్ తన మేనేజర్‌తో ఫోన్ చేయించాడు. ఒకసారి ఆఫీసుకు రమ్మని చెప్పడంతో మా అన్నయ్య, అక్కయ్యను వెంట బెట్టుకుని వెళ్లాను. దీంతో మేనేజర్‌కు కోపం వచ్చింది. మిమ్మల్ని ఒక్కదాన్నే రమ్మన్నాను కదా వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకొచ్చారు అన అడిగాడు. వస్తే మీకేంటి ప్రాబ్లం అన్నాడు. లేదు హీరోయిన్లు ఆఫీసులకు ఒక్కరే రావాలి, పది మందిని వేసుకుని వస్తే ఎట్లా అన్నాడు. అపుడు నేను ఒకటే చెప్పాను... యాక్టింగ్ చేయమనండీ చేస్తాను, నాకు ఎంత వస్తే అంత చేస్తాను, నేను చేయలేని క్యారెక్టర్ నా వల్ల కాదు అని చెబుతాను. మా అక్క, అన్న వెంట వస్తే నీకేంటి అన్నాను. అలా కాదు... ఇండస్ట్రీలో నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి, లేకుంటే ఎదగలేవు అన్నాడు.... అనాడు అని సంజన వివరించింది.

  డబ్బు, ముంబైలో ఫ్లాటు ఆఫర్ చేశాడు... చెంప చెల్లుమనిపించాను

  డబ్బు, ముంబైలో ఫ్లాటు ఆఫర్ చేశాడు... చెంప చెల్లుమనిపించాను

  అపుడు ఆ మేనేజర్ డైరెక్టుగా పాయింటుకు వచ్చాడు.... మీకు డైరెక్టర్‌గారికి బాగా నచ్చారు. కమిట్మెంటుకు ఒప్పుకుంటే...రెమ్యూనరేషన్ డబల్ ఇప్పిస్తా, నీ లైఫ్ మారిపోతుంది, పెద్ద హీరోతో ఈ సినిమా ఓపెనింగ్ చేయిస్తున్నాం, నీకు ముంబైలో మంచి ఫ్లాట్ కొనిస్తానని కూడా డైరెక్టర్ చెప్పారు, ఒప్పుకో అన్నారు. దీంతో నాకు కోపం వచ్చి నేరుగా వెళ్లి డైరెక్టర్‌ చెంప చెల్లుమనిపించాను అని సంజన తెలిపారు. అయితే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం సంజన నిరాకరించారు. అతడు అప్పటికీ ఒక సినిమా తీశాడని, అది కూడా ప్లాపే అని.....సంజన తెలిపారు.

  సంజన బ్యాగ్రౌండ్

  సంజన బ్యాగ్రౌండ్

  2016 నుండి సంజన మోడలింగ్ చేస్తోంది. 2016లో మిస్ హైదరాబాద్ టైటిల్, 2017లో మిస్ గోల్డెన్ గ్లోబ్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఎంపికైంది. ఆమె ఫ్యామిలీ అంతా విజయవాడ దగ్గర నూజివీడోలో ఉంటారు. ఇంట్లో అబ్బాయిలు లేక పోవడం వల్ల వాళ్ల నాన్న ఆమెను అబ్బాయిలా పెంచారట. ఇంటికి ఆమే యజమానురాలు.

  ఐశ్వర్యరాయ్ స్పూర్తి

  ఐశ్వర్యరాయ్ స్పూర్తి

  నాకు ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. తనను ఇన్స్‌స్పిరేషన్‌గా తీసుకుని మోడలింగ్‌లోకి వచ్చాను. మోడలింగ్‌లో చాలా షోలు చేశాను. బిగ్ బాస్ 2లో కామన్ పీపుల్ కు ఎంట్రీ ఉందని తెలిసి నేను కూడా అప్లై చేశాను. అందరినీ బాగా నమ్మేస్తుంటాను అది నా స్ట్రెంత్... అదే విధంగా అందరినీ నమ్మి మోసపోతుంటాను అది నా వీక్ నెస్. బిగ్ బాస్‌లో అవకాశం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది..... అని సంజన తెలిపారు.

  English summary
  Sanjana has been named as one of the contestants of season 2 of bigg boss telugu. Sanjana has been crowned the miss hyderabad title for the Year 2016. In her Latest Interview, she has revealed about her past experience with one of the Directors who has asked for Commitment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X