తెరపైకి బిగ్‌బాస్ 2 నూతన్ నాయుడు... ఆ ఇద్దరు హీరోలతో?
ఈ ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 2'లో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో కౌశల్ ఒక వైపు, మిగతా ఇంటి సభ్యులంతా ఒక వైపు అనే సీన్ క్రియేట్ అయింది. అయితే ఇతర కంటెస్టెంట్లకు భిన్నంగా తన గేమ్ కొనసాగిస్తూ కౌశల్ మండకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు నూతన్ నాయుడు.
కౌశల్‌కు మద్దతుగా ఏర్పడ్డ సోషల్ మీడియా గ్రూఫ్ కౌశల్ ఆర్మీ నుంచి కూడా నూతన్ నాయుడుకు మంచి మద్దతు లభించింది. అతడు ఎక్కువ రోజులు ఇంట్లో కొనసాగడానికి అది చాలా హెల్ఫ్ అయింది. అయితే బిగ్‌బాస్ షో ముగిసిన తర్వాత నూతన్ నాయుడు మీద మీడియా ఫోకస్ తగ్గింది. తాజాగా నూతన్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయింది.

సినిమాల్లోకి నూతన్ నాయుడు
ఇప్పటి వరకు మనం నూతన్ నాయుడుని బుల్లితెరపై మాత్రమే చూశాం. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నూతన్ నాయుడు ఈ సంక్రాంతికి వెండి తెరపై దర్శనమివ్వబోతున్నాడట.

ఎఫ్ 2 సినిమా ద్వారా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమాలో నూతన్ నాయుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ఓ చిన్న కామిక్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి ఐడియా
అనిల్ రావిపూడి తన గత చిత్రం ‘రాజా ది గ్రేట్' చిత్రంలో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజను తీసుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2లో బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడుకు సెట్టయ్యే పాత్ర ఉండటంతో అతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి రిలీజ్
వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











