బిగ్‌బాస్ పూజా రామచంద్రన్ బోల్డ్ స్టేట్మెంట్.. ఇప్పుడది కామన్, నేను రెడీ!
నటి పూజా రామచంద్రన్ స్వామిరారా చిత్రంతో తెలుగులో గుర్తింపు దక్కించుకుంది. పలు చిత్రాల్లో పూజా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో పూజ రామచంద్రన్ కు అవకాశాలు వస్తున్నా ఆమె కెరీర్ వేగం పెంచే పాత్రలు మాత్రం రావడంలేదు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తెలుగు బిగ్ బాస్ 2 లో హైలైట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ లో పూజ రామచంద్రన్ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ తన వ్యక్తగత జీవితం గురించి ప్రస్తావించింది.

వీడియో జాకీగా
పూజా రాంచంద్రన్ మొదట వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తన తోటి విజేగా పని చేస్తున్న ఓ వ్యక్తి ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత పూజా అతడి నుంచి విడిపోయింది. దానికి కారణం తమ ఇద్దరి మధ్య మనస్పర్థలే అని పూజా రామచంద్రన్ తెలిపింది. ప్రస్తుతం పూజా రామచంద్రన్.. జాన్ కొక్కెన్ అనే నటుడితో సహజీవనం చేస్తోంది.

ఫ్రెండ్ షిప్ కాదు
దీని గురించి ఇంటర్వ్యూలో పూజకు ప్రశ్న ఎదురుకాగా.. అది రిలేషన్ షిప్ కాదని కేవలం స్నేహమే అని పూజా చెప్పుకొచ్చింది. మేమిద్దరం ఒకే వృత్తిలో కొనసాగుతూ స్నేహితులుగా కనిపిస్తున్నాము. దీని వలనే ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పూజ రామచంద్రన్ పై వస్తున్న రూమర్స్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

బోల్డ్ సన్నివేశాలు
ఇక నటన గురించి మాట్లాడుతూ.. సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే. వారికి వినోదం అందించేచేందుకు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాను. ఆ క్రమంలో గ్లామర్ పాత్రలు చేయాల్సి వచ్చినా, బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినా తనకు అభ్యంతరం లేదు అని పూజా తెలిపింది. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు కామన్ అని పూజ తెలిపింది.

లక్కీ ఛాన్స్
బిగ్ బాస్ 2లో పూజ రామచంద్రన్ మొదట అవకాశాన్ని దక్కించుకోలేదు. ఆమె వైల్డ్ కార్డు ద్వారా షో మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఇది ఒకరకంగా పూజకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్2 పూజా రామచంద్రన్ కు గుర్తింపు పెంచడంలో ఉపయోగ పడింది. కానీ బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా పూజకు అంతగా అవకాశాలు రావడం లేదు. తాజాగా తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధం అని చెప్పి దర్శక నిర్మాతలని అమర్శించే ప్రయత్నం చేసింది.


Click it and Unblock the Notifications











