Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిస్ అవుతున్నా, చాలా బాధగా ఉంది.. సామ్రాట్ కంటతడి.. తాప్సీ, ఆది, రితిక రచ్చ రచ్చ
బిగ్‌బాస్‌లో 73, 74 రోజు ఎలాంటి వివాదాలు లేకుండా సరదాగా సాగిపోయింది. పెళ్లి టాస్క్ వేడుక ముగిసిపోవడంతో ఇంటి సభ్యులు రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత ఎక్స్ట్రా లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. అలాగే ఇంట్లోకి నీవెవరివి చిత్ర హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, రితిక, తాప్సీ పన్ను రావడంతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇంట్లో ఏం జరిగిందనే విషయాన్ని వివరంగా తెలుసుకోవాలంటే..
Recommended Video
పెళ్లి టాస్క్
గత రెండు రోజులుగా సాగిన పెళ్లి టాస్క్ విజయవంతంగా ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఇంటి సభ్యులంతా చక్కగా తమ పాత్రలను పోషించారని ప్రతీ ఒక్కరిని అభినందించారు. సీక్రెట్ టాస్క్ చేసిన సామ్రాట్, రోల్ రైడాలను ప్రత్యేకంగా అభినందించారు.
సామ్రాట్, రోల్ రైడాకు గిఫ్టులు
సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన సామ్రాట్, రోల్ రైడాలకు ఇంటి నుంచి వచ్చిన ప్రత్యేకమైన బహుమతులను బిగ్‌బాస్ అందజేశారు. వాటిని చూసి ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యుల ఫోటోలను చూసి ఉద్వేగానికి, సంతోషానికి లోనయ్యారు.
సామ్రాట్ కెమెరా ముందుకు
సామ్రాట్ కెమెరా ముందుకు వచ్చి లారా అనే నా పెంపుడు పిల్లిని మిస్ అవుతున్నాను. దానిని చిన్నగా ఉన్నప్పుడే దత్తత తీసుకొన్నాను. ఇప్పడు పెద్ద పెరిగి ఉండవచ్చని కంటతడి పెట్టుకొనేంతగా ఫీలయ్యాడు. తల్లిదండ్రులను తలుచుకొన్నాడు. వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొన్నారు.
కెప్టెన్సీ టాస్క్ కోసం
కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులు అప్పుడే తమ వ్యూహాలను పన్నుతున్నారు. నేను ఈ సారి కెప్టెన్సీ కోసం పోటీ పడుతాను అని దీప్తి నల్లమోతు అన్నారు. ఇంటి సభ్యుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. అలాగే కౌశల్, ఇతర సభ్యులు కూడా కెప్టెన్సీ టాస్క్‌పై దృష్టి పెట్టారు.
ఇంట్లోకి తాప్సీ, ఆది, రితిక
అంతలోనే ఇంటిలోకి తాప్సీ, ఆది పినిశెట్టి, రితిక సింగ్ ప్రవేశించారు. యాక్టివిటీ రూంలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ రేడియో సెంటర్ నుంచి ఇంటి సభ్యులను పలకరించారు. పూజాకు సామ్రాట్ లవ్ ప్రపోజల్ చేయడం, తాప్సీకి తనీష్ ప్రపోజ్ చేయడం, అమిత్, దీప్తి, గణేష్ స్కిట్ చేయడం, బిగ్‌బాస్‌గా తనీష్ వ్యవహరించగా అతడిని గీతా మాధురి ఆట పట్టించే టాస్కులు ఎంజాయ్‌గా జరిగాయి.