twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్ అవుతున్నా, చాలా బాధగా ఉంది.. సామ్రాట్ కంటతడి.. తాప్సీ, ఆది, రితిక రచ్చ రచ్చ

    By Rajababu
    |

    బిగ్‌బాస్‌లో 73, 74 రోజు ఎలాంటి వివాదాలు లేకుండా సరదాగా సాగిపోయింది. పెళ్లి టాస్క్ వేడుక ముగిసిపోవడంతో ఇంటి సభ్యులు రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. అలాగే ఇంట్లోకి నీవెవరివి చిత్ర హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, రితిక, తాప్సీ పన్ను రావడంతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇంట్లో ఏం జరిగిందనే విషయాన్ని వివరంగా తెలుసుకోవాలంటే..

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 74 Highlights...!!
    పెళ్లి టాస్క్

    పెళ్లి టాస్క్

    గత రెండు రోజులుగా సాగిన పెళ్లి టాస్క్ విజయవంతంగా ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఇంటి సభ్యులంతా చక్కగా తమ పాత్రలను పోషించారని ప్రతీ ఒక్కరిని అభినందించారు. సీక్రెట్ టాస్క్ చేసిన సామ్రాట్, రోల్ రైడాలను ప్రత్యేకంగా అభినందించారు.

    సామ్రాట్‌, రోల్ రైడాకు గిఫ్టులు

    సామ్రాట్‌, రోల్ రైడాకు గిఫ్టులు

    సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన సామ్రాట్, రోల్ రైడాలకు ఇంటి నుంచి వచ్చిన ప్రత్యేకమైన బహుమతులను బిగ్‌బాస్ అందజేశారు. వాటిని చూసి ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యుల ఫోటోలను చూసి ఉద్వేగానికి, సంతోషానికి లోనయ్యారు.

    సామ్రాట్ కెమెరా ముందుకు

    సామ్రాట్ కెమెరా ముందుకు

    సామ్రాట్ కెమెరా ముందుకు వచ్చి లారా అనే నా పెంపుడు పిల్లిని మిస్ అవుతున్నాను. దానిని చిన్నగా ఉన్నప్పుడే దత్తత తీసుకొన్నాను. ఇప్పడు పెద్ద పెరిగి ఉండవచ్చని కంటతడి పెట్టుకొనేంతగా ఫీలయ్యాడు. తల్లిదండ్రులను తలుచుకొన్నాడు. వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొన్నారు.

    కెప్టెన్సీ టాస్క్‌ కోసం

    కెప్టెన్సీ టాస్క్‌ కోసం

    కెప్టెన్సీ టాస్క్‌ కోసం ఇంటి సభ్యులు అప్పుడే తమ వ్యూహాలను పన్నుతున్నారు. నేను ఈ సారి కెప్టెన్సీ కోసం పోటీ పడుతాను అని దీప్తి నల్లమోతు అన్నారు. ఇంటి సభ్యుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. అలాగే కౌశల్, ఇతర సభ్యులు కూడా కెప్టెన్సీ టాస్క్‌పై దృష్టి పెట్టారు.

    ఇంట్లోకి తాప్సీ, ఆది, రితిక

    ఇంట్లోకి తాప్సీ, ఆది, రితిక

    అంతలోనే ఇంటిలోకి తాప్సీ, ఆది పినిశెట్టి, రితిక సింగ్ ప్రవేశించారు. యాక్టివిటీ రూంలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ రేడియో సెంటర్ నుంచి ఇంటి సభ్యులను పలకరించారు. పూజాకు సామ్రాట్ లవ్ ప్రపోజల్ చేయడం, తాప్సీకి తనీష్ ప్రపోజ్ చేయడం, అమిత్, దీప్తి, గణేష్ స్కిట్ చేయడం, బిగ్‌బాస్‌గా తనీష్ వ్యవహరించగా అతడిని గీతా మాధురి ఆట పట్టించే టాస్కులు ఎంజాయ్‌గా జరిగాయి.

    English summary
    Bigg Boss 2 Telugu 73, 74 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Nuvvevarivo team entered into bigg Boss house
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X