విదేశీ భామతో ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్
బిగ్‌బాస్ షో ఎంతో మంది సెలబ్రిటీలను తమ అభిమానులకు మరింత దగ్గర చేస్తుంది. అంతవరకు పరిచయం లేని వ్యక్తులను తమ ఇంటి సభ్యుడిగానూ మార్చేస్తుంది. ఎంతో మంది సెలబ్రిటీలకు కొత్త ఫ్యామిలీని అందిస్తుంది. కొత్త బంధాలు ఏర్పడుతాయి.
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో తనీష్, దీప్తి సునయన, సామ్రాట్, తేజస్వి ఎంత మంచిగా కలిసి ఉన్నారో అందరం చూశాం. బయటకు వచ్చాక కూడా వారి స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకరి ఇంట్లో వేడుకలు జరిగితే మిగతా అందరూ పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు.

ఓ చారిటికి సంబంధించి.. క్రికెట్ ఆడటానికి తెలుగు హీరోలు, నటులు కొంతమంది అమెరికాకు వెళ్లారు. అందులో సామ్రాట్ కూడా క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. కప్ గెలిచిన ఆనందంలో అక్కడి వీధుల్లోనే విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ విదేవీ భామతో సామ్రాట్ ఎంజాయ్ చేస్తోన్నట్లు కనిపిస్తోంది. అలాగే దీప్తి సునయన కొత్త లుక్‌కు సంబంధించిన ఓ పోస్ట్ కూడా చేశాడు.


Click it and Unblock the Notifications











