అమ్మాయిల న్యూడ్ ఫోటోలు, నా జీవితం నాశనం, యుద్ధం వేళ ఇదేంటి?: మీడియా ముందు కౌశల్

Recommended Video

Kaushal Manda About Kaushal Army Member Seshu Babu | Filmibeat Telugu

కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ డబ్బు మనిషి అని, అభిమానుల డబ్బు ఖర్చుపెడుతున్నంత సేపు వారిని వాడుకుంటాడని, ఆ తర్వాత వారిని పక్కన పెడతాడని, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో డబ్బు వసూలు చేసి తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కౌశల్ గురువారం మీడియా ముందుకు వచ్చారు. కౌశల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

నాకు కవాల్సింది డబ్బు కాదు.. అభిమానం

నాకు కవాల్సింది డబ్బు కాదు.. అభిమానం

నా మీద ఆరోపణలు చేస్తున్న వారు ప్రూఫ్స్ పేరుతో కొన్ని పేపర్లు చూపిస్తున్నారు.. కానీ అందులో నిజా నిజాలు తెలుసుకోకుండా టీవీ ఛానల్స్ వారు చెప్పేదే నిజం అనేలా కార్యక్రమాలు చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల మంది అన్నయ్యా అన్నయ్యా అంటూ నా వద్దకు వచ్చారు. అభిమానంతో వచ్చిన వారిని రిసీవ్ చేసుకుని ఆప్యాయంగా హగ్స్ ఇచ్చాను. శేషు అనే వ్యక్తి అన్నయ్యా మా ఊరు రావాలి, మీకు చాలా మంది ఓటేశారు, వారిని కలవాలి అంటే అందరి దగ్గరికి వెళ్లి కలిశాను. అప్పుడే నేను ఎవరినీ ఫ్లైట్ టికెట్ ఇవ్వండి, బిజినెస్ క్లాస్ టికెట్స్ ఇవ్వండి అని ఎవరినీ అడగలేదు. కారు పంపిస్తానంటే కార్లో కూడా వెళ్లాను. ఫ్లైట్ టికెట్స్ పంపిస్తాం ఫ్లైట్లో రండి అంటే అలాగే వెళ్లాను.

ఫ్యామిలీని వదిలేసి అభిమానుల కోసం

ఫ్యామిలీని వదిలేసి అభిమానుల కోసం

నాలుగు నెలలు బిగ్ బాస్ ఇంట్లో పెళ్లాం పిల్లలకు దూరంగా గడిపాను. సాధారణంగా ఇంకొకరు అయితే బయటకు రాగానే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తారు. కానీ నేను బయటకు వచ్చాక అభిమానుల రూపంలో నాకు కొత్త ఫ్యామిలీ ఏర్పడిందని మూడు నెలలు వారితో తిరుగుతూ గడిపాను. వారి కోసం సినిమాలు కూడా మానేశాను. ఎవరైనా అమ్మ పిలిచి ఆవకాయ పచ్చడి మెతుకులు తినిపించినా కాదనకుండా వెళ్లాను. నాకు కావాల్సింది అభిమానం.. డబ్బు కాదు.

రోడ్డు మీద కుక్కులు, బిస్కెట్లు పెట్టి పాలించలేను

రోడ్డు మీద కుక్కులు, బిస్కెట్లు పెట్టి పాలించలేను

నా ఫ్యామిలీ కోసం కూడా సరిగా టైమ్ స్పెండ్ చేయకుండా నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల కోసం గడిపాను. ఎవరో రాంగ్ ఎలిగేషన్ చేస్తే ఎలా నమ్ముతారు? కుక్కులు రోడ్డు మీద అరుస్తూనే ఉంటాయి. నేను అందరినీ పిలిచి బిస్కెట్లు పెట్టి పాలించలేను. వారు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ప్రజలకు ఆన్సర్ చేయాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చాను.

సరిహద్దులో యుద్దం జరుగుతుంటే.. నాకు వ్యతిరేకంగా కార్యక్రమాలా?

సరిహద్దులో యుద్దం జరుగుతుంటే.. నాకు వ్యతిరేకంగా కార్యక్రమాలా?

ఓ పక్క సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే వారికి సెల్యూట్ కొడుతూ ఈ రోజు మీ ముందుకువ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే అందుకు కారణం నా మీద, నా భార్య వస్తున్న ట్రోల్స్ కు ఆన్సర్ చెప్పడం కోసమే. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే దేశంలోని యువతను స్పూర్తినిచ్చే కార్యక్రమాలు ప్రసారం చేయడం మాని కొన్ని మీడియా ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం కౌశల్ పేరు వాడుకుని, అతడిపై వచ్చిన రాంగ్ ఎలిగేషన్స్‌ను ఫోకస్ చేసే కార్యక్రమాలు చేయడం ఏమిటి? టీఆర్పీల కోసం నా జీవితాన్ని నాశనం చేశారు.

నా జీవితం నాశనం

నా జీవితం నాశనం

నా మీద ఆరోపణలు చేసిన వారు బానే ఉంటారు, వారిని ప్రశ్నలు అడిగిన వారు బానే ఉంటారు. ఇక్కడ నా జీవితం నాశనం అయింది. 20 సంవత్సరాలు ఎన్నో సినిమా ఆఫీసులు తిరిగి తిరిగి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేకోవాలని కష్టపడి గెలిస్తే నా జీవితాన్ని నాశనం చేశారు. జనాలు టీవీలో ఏం వేసినా నమ్మేస్తారు. అది నిజమా? కాదా? వారికి అవసరం లేదు.

అమ్మాయిల న్యూడ్ ఫోటోలు

అమ్మాయిల న్యూడ్ ఫోటోలు

శేషు బాబు అనే వ్యక్తి కౌశల్ ఆర్మీ పేరుతో చాలా అరాచకాలు చేశాడు. కౌశల్‌ను కలవాలంటే నువ్వు నాకు న్యూడ్ పిక్చర్స్ పంపించాలి.. అప్పుడే నిన్ను అతడితో కలిపిస్తాను అంటూ కొందరిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈడెవడండీ నన్ను కలిపించడానికి. ఎంతో మంది మైనర్ అమ్మాయిలు నాకు ఫోన్ చేసి అన్నయ్యా మిమ్మల్ని కలవాలంటే న్యూడ్ ఫోటోలు పంపించాలని అడుగుతున్నారు అని చెప్పారు. ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇవన్నీ నేను అపుడు నమ్మలేదు.

చివరకు డిసెంబర్ 31న రాత్రి ఎయిర్ పోర్టులో ఇద్దరు అమ్మాయిలు నాతో వచ్చి సెల్ఫీ తసుకుంటే వారిని శేషు బాబు బూతులు తిట్టాడు. నాకు కోపం వచ్చి నువ్వు ఎయిర్ పోర్టులో పబ్లిక్ ముందు ఇలా ఎలా మాట్లాడతావని ఫైర్ అయ్యాను. ఆ తర్వాత ఆ అమ్మాయిలను కారుతో గుద్దించడానికి ప్రయత్నాలు చేశాడు. అలాంటి ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా మారి సోమిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తితో చేతుల కలిపి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని కౌశల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X