నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ అడిగారు, శ్రీముఖి, హిమజ మానిప్యులేటర్స్: బిగ్ బాస్ షోపై హేమ

బిగ్ బాస్ షో నుంచి తొలివారమే బయటకు వస్తానని ఊహించలేదు అన్నారు నటి హేమ. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా వారంతా ఇంటర్వ్యూలు అడుగుతుండటంతో ఆమె అందరికీ ఒకే చోటకు పిలిచి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గూగుల్ ఓటింగ్ కోట్లలో పడ్డాయి. అయితే ఆ ఓట్లు హాట్ స్టార్లో పడక పోవడం నా దురదృష్టం. నా గురించి ఎంతో మంది తమ సోషల్ మీడియా పేజీల్లో పాజిటివ్‌గా పెడుతున్నారు. ఆ విధంగా చూస్తే నేను వారి మనసులు గెలుచుకున్నట్లు, విన్ అయినట్లే లెక్క అని హేమ తెలిపారు. తొలి వారమే బయటకు వచ్చినందుకు ఎలాంటి బాధ లేదని ఆమె తెలిపారు.

ఎవరినీ తిట్టలేదు, తిట్టించుకోలేదు

ఎవరినీ తిట్టలేదు, తిట్టించుకోలేదు

బిగ్ బాస్ ఇంట్లో నేను ఎవరినైనా తిడితే తనకంటే చిన్నవారిని తిట్టింది అంటారు. ఒక వేళ తిట్టించుకుంటే చిన్న పిల్లలతో తిట్టించుకుంది అంటారు. ఇంట్లో ఉన్న వారితో నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందుకే నేను తిట్టలేను, తిట్టించుకోలేను. పైగా నాకు నటించడం రాదు. నా మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. నేను బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టే సమయంలో నువ్వు నీలా ఉండు, నటించొద్దు అని చాలా మంది సూచించారు. అందుకే నేను జెన్యూన్‌గా గేమ్ ఆడినట్లు హేమ తెలిపారు.

నేను కాంట్రవర్సల్ కాదు, అాలా అనొద్దు

నేను కాంట్రవర్సల్ కాదు, అాలా అనొద్దు

బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాత అందరూ నన్ను కాంట్రవర్సల్ అంటున్నారు. నన్నెందుకు ఇలా అంటున్నారో తెలియడం లేదు. దయచేసి నాకు కాంట్రవర్సల్ అనే టైటిల్ పెట్టొద్దు. రెబల్, నవ్వుల హేమ ఈ రెండు టైటిల్స్ చాలు అని హేమ తెలిపారు.

శ్రీముఖి, హిమజ మానిప్యులేటర్స్

శ్రీముఖి, హిమజ మానిప్యులేటర్స్

బాబా మాస్టర్ నేను మంచోడిని అనిపించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. జాఫర్ గారు నేను ఒక జర్నలిస్టు, చిన్న పిల్లాడిలా యాక్ట్ చేస్తే బయట ఏమనుకుంటారో? అని ఆయన టెన్షన్ పడుతున్నారు. శ్రీముఖి లోపలిది బయట, బయటిది లోపల చెప్పి మానిప్యులేట్ చేస్తోంది. తను ఇలా చేస్తుంది అని నేను చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఆ పిల్లలు లేరు. హిమజ టోటల్లీ మానిప్యులేటర్. ఆమె బయట అంతే... ఇంట్లోనూ అంతే. అలీరెజా మంచి ప్లేయర్ అని హేమ తెలిపారు.

నా ఓటు ఆమెకే వేస్తాను

నా ఓటు ఆమెకే వేస్తాను

నేను ఓటు వేయాల్సి వస్తే... అషురెడ్డికి వేస్తాను. ఆమె ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, అషు ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ షో నుంచి నేను ఏమీ నేర్చుకోలేదు. ఎందుకంటే ఏమీ మొదలు పెట్టకముందే బయటకు వచ్చాను. ఒక వేళ మళ్లీ వెళ్లాల్సి వస్తే ఏమైనా నేర్చుకుంటానేమో? అన్నారు.

నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారు

నన్ను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారు

మిమ్మల్ని కూడా వంద రోజులు సెక్స్ లేకుండా ఉంటారా? అని అడిగారా? అనే ప్రశ్నకు హేమ స్పందిస్తూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు నన్ను ఎలాంటి కాంట్రవర్సల్ ప్రశ్నలు అడగలేదు. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఒక వేళ ప్రెగ్నెన్సీ ఉంటే మూడు నెలలు అక్కడ ఉండాల్సి ఉంటుంది, ఏదైనా జరుగరానిది జరిగితే బిగ్ బాస్ షోకు నష్టం జరుగుతుంది కాబట్టి అలా అడిగారు. దాన్ని నేను తప్పుగా, భూతద్దంలో పెట్టి చూడటం లేదన్నారు.

రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నాను

రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నాను

బిగ్ బాస్ వెళ్లడం వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయిందని అనుకోవడం లేదు. రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నాను. నేను అడిగినంత ఇస్తానంటేనే వెళ్లాను. నన్ను మొదటి సీజన్లోనే అడిగితే వెళ్లలేదు. రెండో సీజన్ సమయంలో అడగలేదు. నేను రాజకీయాల్లోకి వెళుతున్నాను కాబట్టి బిగ్ బాస్ లాంటి షోలకు వెళితే పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా అనేది తెలుస్తుందని కాబట్టి మూడో సీజన్లోకి వెళ్లడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X