Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాహుల్‌ను వదిలేసి పార్టీ.. అక్కడ ముద్దు పెట్టు అంటూ రెచ్చిపోయిన పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ఎంత గ్రాండ్‌గా ముగిసిందో అందరికీ తెలిసిందే. అందరూ ఊహించినట్లు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమవుతూ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచి విజేతగా నిలిచాడు. మొదటి నుంచి ఉన్న అన్ని అంచనాలు తారుమారై చివరకు రాహుల్ ట్రోఫీ గెలిచాడు. షో మొదలైన ఫస్ట్ డే నుంచి శ్రీముఖి విన్నర్‌గా నిలుస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డా.. రాను రాను అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. చివరకు ఎటువంటి అంచనాలు లేకుండా షోలో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు.
హౌస్‌లో ఆనలుగురి ప్రయాణం..
బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి వరుణ్, వితిక, రాహుల్, పునర్నవిలు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీరి గ్యాంగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఈ నలుగురు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే అక్కడ ఎంటర్టైన్ పీక్స్‌లో ఉంటుంది. హౌస్‌లో ఆ నలుగురు ఉన్నన్నీ రోజులు గొడవలు, అలకలు, అరుపులు, ప్రేమలు, కోపాలతో దూరం పెరిగినా.. మళ్లీ ఒక్కటి కావడం అందరికీ నచ్చింది.
ప్రత్యేకంగా నిలిచిన రాహుల్-పునర్నవి
వరుణ్, వితికా భార్యాభర్తలు కాబట్టి.. వారి గురించి ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అయితే రాహుల్-పునర్నవి మధ్య ఉన్న రహస్య సంబంధం ఏంటన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతూ వచ్చేంది. వీకెండ్లో హోస్ట్‌గా వచ్చే నాగార్జున సైతం వీరిపై ఎక్కువగా శ్రద్ద పెట్టేవాడు. ఎన్ని సార్లు నాగ్ ప్రశ్నించినా.. తెలివిగా దాటవేసేవారు. వీరి కెమెస్ట్రీకి చాలా మంది ఫిదా అయిపోయారు.
రాహుల్, పున్నులకు ఎదురయ్యే ఒకే ప్రశ్న
బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసింది.. కానీ అందులోంచి పుట్టిన అనుమానాలు మాత్రం తీరడం లేదు. బయటకు వచ్చిన పునర్నవి, రాహుల్‌కు ఎక్కడికి వెళ్లినా ఒకే ప్రశ్న ఎదురవుతుంది. ఇంటర్వ్యూ కోసం ఏ మీడియా చానెళ్కు వెళ్లినా.. రాహుల్-పునర్నవి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్న ఎదురువుతూనే ఉంది. అంతగా వీరిద్దరు పాపులర్ అయ్యారు.
కేవలం మంచి స్నేహితులమే..
తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు చెప్పినా.. రూమర్లకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. తానెంతో తనతో ఉన్నవారికి తెలుస్తుందని, రాహుల్ తనకు కేవలం మంచి స్నేహితుడేనని పునర్నవి చెబుతూ ఉండగా.. స్నేహితురాలి కంటే కొంచెం ఎక్కువ అని రాహుల్ చెప్పుకొస్తాడు. ఇక వీరిద్దరి మధ్య అలా ఏదో ఒక తెలియని బంధం కొనసాగుతూ ఉన్నట్లుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు.
Recommended Video
రాహుల్‌ను వదిలేసి పార్టీ..
రాహుల్ లేకుండా ఆ ముగ్గురు పార్టీ చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అలీ, హిమజ, వితికా, వరుణ్, పునర్నవిలు కలిసి మంచి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కిస్ మై యాస్ అంటూ పునర్నవి, ఆమె తాగి ఉంది అంటూ వితికా, టూ సెక్సీ అంటూ హిమజ ఫ్లకార్డ్‌లను పట్టుకుని పోజిలిస్తున్నారు. రాహుల్‌ను మిస్ అవుతున్నా అంటూ వితికా పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.