బిగ్ బాస్ 3లో ఫైరింగ్ బ్యూటీ.. ఫైనల్ చేసేశారు! ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

Recommended Video

Bigg Boss Telugu 3 : Contestants Getting Finalized For #Bigbosstelugu3 || Filmibeat Telugu

మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి రోజుకో ప్రోమోతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. గత రెండు సీజన్లు భారీ సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం ఈగర్‌గా వైట్ చేస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్‌డేట్స్ తెలుసుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వార్త బిగ్ బాస్ ఆడియన్స్‌ని హుషారెత్తిస్తోంది. వివరాల్లోకి పోతే..

బిగ్ బాస్ సీజన్ 3

బిగ్ బాస్ సీజన్ 3

బిగ్ బాస్ సీజన్ 3 ని గత ఎపిసోడ్స్ కంటే మరింత ఆసక్తికరంగా మలచాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో పార్టిసిపెంట్స్ మొదలుకొని హోస్ట్ వరకూ స్పెషల్ పర్సన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా నాగార్జున కనిపించనున్నారని గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ ప్రోమో విడుదల చేసింది బిగ్ బాస్ యూనిట్. స్వయంగా నేనే రంగంలోకి దిగుతున్నా అని ఈ ప్రోమో ద్వారా ప్రకటించారు నాగార్జున.

14 మంది పార్టిసిపెంట్స్.. గాయత్రీ గుప్తా

14 మంది పార్టిసిపెంట్స్.. గాయత్రీ గుప్తా

హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. అయితే వాళ్లెవరనేది మాత్రం అఫీషియల్ గా బయటకు చెప్పలేదు. కాగా గత కొద్ది రోజులుగా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు ఇవే అంటూ ఆసక్తికర పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిదా ఫేం గాయత్రీ గుప్తా పేరు బయటకు వచ్చింది.

సెక్సువల్ ఇష్యుస్ పై కామెంట్స్

సెక్సువల్ ఇష్యుస్ పై కామెంట్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించి క్రేజ్ కొట్టేసింది గాయత్రి గుప్తా. ఇక ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో కాస్టింగ్ కౌచ్, మహిళలపై లైంగిక దాడులు లాంటి అంశాలపై కామెంట్స్ చేసి ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమె బిగ్ బాస్ పార్టిసిపెంట్ అనే సరికి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం

గాయత్రి గుప్తాను బిగ్ బాస్ 14 మంది పార్టిసిపెంట్స్ లో ఫైనల్ చేసేశారని సమాచారం. ఇప్పటికే యాంకర్ శ్రీముఖి ఫైనల్ అయింది. ఈమెతో పాటు 'జబర్దస్త్' షో కమెడియన్ రోహిణి కూడా బిగ్ బాస్ లో కనిపించనుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఆసక్తికర పేర్లు బయటకు వస్తాయో అనిపిస్తోంది. మొత్తానికైతే నాగార్జున హోస్టింగ్ లో బీడ్ బాస్ సీజన్ 3 బుల్లితెర ఆడియన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X