బిగ్ బాస్‌లో విలన్ అతనే.. ఇలాంటి ఆలోచనలేంటని అనుకున్నాను.. అభిజిత్ తల్లి కామెంట్స్
బిగ్ బాస్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలా ప్రస్తుతమున్న షో క్రేజ్, అందులో అభిజిత్ హారిక కాంబోలో అభిక ఫాలోయింగ్‌ను యాంకర్ రవి క్యాచ్ చేశాడు. తన యూట్యూబ్ చానెల్‌లో అభిక మీద ఓ ఇంటర్వ్యూ చేశాడు. అందులో అభిజిత్ తల్లి లక్ష్మీ, హారిక తల్లి జ్యోతిని యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం రవి చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది.

సిక్స్ ప్యాక్ కోసం..
అభిజిత్ సిక్స్ ప్యాక్ కోసం ఎంతో కష్టడ్డాడు.. అభితో పాటు మేము కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉప్పు లేని తిండి మూడు నెలల పాటు తిన్నాం. చికెన్ వండినా ఏది వండినా ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా వండేదాన్ని. ఇప్పటికీ కూడా అభి అదే మెయింటైన్ చేస్తున్నాడు అని అభిజిత్ తల్లి లక్ష్మీ చెప్పుకొచ్చారు.

అప్పుడు భయమేసింది..
సోహెల్ అరియానా సీక్రెట్ రూం నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు అభిజిత్ ఫైర్ అవ్వడంతో బాగా భయమేసింది. నెగెటివిటీ ఎక్కువగా వచ్చేస్తుందేమో అని భయపడ్డాను. కానీ ఆ తరువాత అసలు విషయం తెలిసింది. చాలా సేపు తరువాత ఓపిక నశించడంతో అలా అన్నాడని తెలియడంతో ఊపిర పీల్చుకున్నానని లక్ష్మీ పేర్కొన్నారు.

బిగ్ బాస్ షోలో విలన్..
బిగ్ బాస్ షోలో విలన్ అమ్మ రాజశేఖర్, అఖిల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎదుటి వారిని మనం ఒక మాట అంటే.. వారు అన్నప్పుడు కూడా పడే ఓపిక ఉండాలి అలా లేనప్పుడు మనం ఎదుటి వారిని అనకూడదు. అభిజిత్ మొదటి నుంచి అమ్మ రాజశేఖర్‌కు అదే చెప్పుకుంటూ వచ్చాడు. నా విషయంలో షోలో విలన్ అంటే అమ్మ రాజశేఖర్ అని లక్ష్మీ చెప్పుకొచ్చారు.
Recommended Video

ఇలాంటి ఆలోచనలేంటి.
రోబో టాస్కులో కిడ్నాప్ అనే ఐడియా ఇచ్చినప్పుడు షాక్ అయ్యాను. వాడు అలాంటి ఆలోచనలు చేస్తున్నాడేంటని అనుకున్నాను. ఆ సమయంలో గంగవ్వ ఇచ్చిన సపోర్ట్ బాగుంది. ఆమె బయటకు వెళ్లి అఖిల్‌ను ట్రాప్ చేయాలని చూడటం లోపలకు వచ్చి కన్ను కొట్టడం అమ్మో ఆమె మహానటి.. అప్పుడు అభిజిత్‌కు బాగా సపోర్ట్ చేశారు అని లక్ష్మీ తెలిపారు.


Click it and Unblock the Notifications











