Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అభిజిత్‌కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో...ఏకిపారేసిన ఆర్జే కాజల్.. ట్రెండ్ చేస్తోన్న అఖిల్ ఫ్యాన్స్!!
బిగ్ బాస్ షో తెలుగులో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే విచిత్రం ఏంటంటే.. షో కంటే మీమ్స్, ట్రోల్స్, డే టు డే రివ్యూలు ఇచ్చే వారు అంత కంటే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. బిగ్ బాస్ షోను ఫాలో అవ్వని వారు కూడా ఆ మీమ్స్, ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొందరు ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇస్తారు. ఆ కంటెస్టెంట్ ఇలా.. ఈ కంటెస్టెంట్ ఇలా అంటూ చెబుతుంటారు. అయితే రేడీయో జాకీ అయినా ఆర్జే కాజల్ బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు రివ్యూలు ఇవ్వడం ప్రారంభించింది.
వీడియోలతో వైరల్..
బిగ్ బాస్ ఎపిసోడ్‌ను సింప్లిఫై చేస్తూ కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆర్జే కాజల్. అందులో కొందరు కంటెస్టెంట్లపై సెటైర్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా ఆర్జే కాజల్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అభిజిత్‌ను దారుణంగా ఏకిపారేయడంతో అఖిల్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కాజల్ చేసిన పోస్ట్‌ను అఖిల్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.
నామినేట్ అవ్వడం..
అభిజిత్‌కు నామినేట్ అవ్వడంలోనే ఆసక్తి ఉంటుంది. ఓ పాయింట్ చెబుతాడు సైలెంట్ అవుతాడు. ఎక్కువ సార్లు నామినేట్ అయ్యేందుకు రెడీగా ఉంటాడు. అదే అతని స్ట్రాటజీ.. అతను మార్నింగ్ డ్యాన్సులు చేయదు.. సరదాగా జరిగే చర్చల్లో పాల్గొనడంటూ ఆర్జే కాజల్ దారుణంగా కామెంట్స్ చేసింది.
ఎందుకు ఓట్లు..
ఈ గేమర్ ప్రమోషనల్ టాస్కుల్లో కూడా పార్టిసిపేట్ చేయడు.. డ్రింక్స్ తాగమంటే తాగడు.. అవన్నీ పక్కన పెడితే.. ఇతను ఫిజికల్ టాస్కులు, లగ్జరీ బడ్జెట్ టాస్కులు, ఇతరులతో కలిసిపోవడం, ఎంటర్టైన్మెంట్ ఏమీ ఇవ్వడు.. పైగా బిగ్ బాస్‌నే ఛాలెంజ్ చేస్తాడు.. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాడు.. జనాలు ఎందుకు ఓట్లు వేస్తున్నారో నాకు అర్థమే కావడం లేదు.. అతనిలో ఉన్న ప్రతీ నెగెటివ్ పాయింట్‌ను ఇలా పాజిటివ్‌గా మార్చేస్తున్న పెయిడ్ మీడియాకు కుదోస్ అంటూ ఆర్జే కాజల్ ఓ పోస్ట్ పెట్టింది.
Recommended Video
ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో
ఇక ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండటంతో కొందరు ఆర్జే కాజల్ ఎవరు? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు దారుణంగా తిడుతున్నారు. అయితే తాను ఆ పోస్ట్‌లో ఏమని చెప్పానో.. అన్నానో వాటికి ఎప్పుడూ కట్టుబడే ఉంటాను.. అతడ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ ఆర్జే కాజల్ చెప్పుకొచ్చింది.