నిజంగా ప్రేమే..? నగ్నంగా పె(టా)ట్రేగిపోతున్న వైనం!
ముంబై: 'పెటా'(PETA) సంస్థ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదనుకుంటా. జంతుల హక్కుల కోసం పోరాడే ఈ అంతర్జాతీయ సంస్థకు చాలా మంది సెలబ్రిటీలు తమదైన రీతిలో ప్రచారం చేస్తుంటారు. జంతువులను హింసించ కూడదని, వాటిని చంపి తినకూడదని, మనషి స్వార్థం కోసం వాటిని వాడు కోకూడదని, అవి కూడా మన తోటి జీవులే... మనలాగే వాటికీ జీవించే హక్కు ఉంది, వాటిని ప్రేమించండి అనేది ఈ సంస్థ సిద్ధాంతం.
పెటా కోసం ప్రచారం చేసే వారిలో ఎక్కువ మంది సినీమా సెలబ్రిటీలు, మోడల్స్ కావడంతో అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మధ్య పెటాకు మద్దతు ఇచ్చే సెలబ్రిటీల సంఖ్య బాగా పెరిగి పోయింది. పలువురు టాప్ సెలబ్రిటీలు ఈ సంస్థ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి జంతువులపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఇది నిజంగా జంతువులపై వారికున్న ప్రేమేనా? లేక పెటా పేరుతో పబ్లిసిటీ కోసం ఈ నగ్న ప్రదర్శనకు దిగుతున్నారా? అంటే మాత్రం చెప్పడం కష్టమే.
తాజాగా పెటా కోసం బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులు ఇచ్చి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంతువులను హింస పెట్ట వద్దు, వాటిని చంపొద్దు. జంతువులపై హింస తగ్గాలంటే జనం వాటిని హింసించడం ద్వారా వచ్చే ఉత్పత్తులయిన లెదర్(తోలు) ఉత్పత్తులు, ఇతర జంతు సంబంధ వస్తువులు వాడటం మానేయాలి అని వ్యాఖ్యానించారు.

పెటా కోసం నగ్నంగా మారిన సప్నా భవాని.

దేశంలో పేరెన్నిక గన్న సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ లలో సప్నా భవాని ఒకరు. ఆమె కస్టమర్లలో మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కత్రినా కైఫ్, బిపాసా బసు, జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, గౌరీ ఖాన్, డినో మోరియా, మందిరా బేడీ లాంటి వారు ఉన్నారు.

బిగ్ బాస్ 6 రియాల్టీషోలో పాల్గొన్న ఆమె పెటా కోసం ప్రచారం చేస్తూ లెదర్ ఉత్పత్తులను వాడకూడదని సూచిస్తున్నారు.

భారత దేశంలో ఆవులు, ఎద్దుల చర్మాలను ఎక్కువగా లెదర్ ఉత్పత్తులకు వాడుతున్నారు, వాటిని తీవ్రంగా హింసిస్తున్నారు అని సప్నా భవాని ఆవేదన వ్యక్తం చేసింది.

జంతువుల సంరక్షణ కోసం పెటా లాంటి సంస్థలు పని చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











