twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన అభిజిత్.. తిరుమలలో బిగ్ బాస్ విజేత హల్చల్

    |

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు నిత్యం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. నాల్గో సీజన్ ముగిసినా కూడా కంటెస్టెంట్ల హవా మాత్రం తగ్గడం లేదు. రోజూ ఎవరో ఒకరు ఏదో రకంగా రచ్చ చేయడం, సోషల్ మీడియాలో అవి ట్రెండ్ అవ్వడం జరుగుతూనే వస్తుంది. అయితే అభిజిత్ మాత్రం వీటన్నంటికి కాస్త దూరంగా ఉంటున్నాడు.తన పని ఏదో తాను చూసుకుంటూ వెళ్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిజిత్ ట్రెండ్ అవుతున్నాడు.

    బిగ్ బాస్ విజేతగా...

    బిగ్ బాస్ విజేతగా...

    బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎప్పుడు జరిగినా గెలిచేది మాత్రం అభిజిత్ అని ముందుగానే ఫిక్స్ అయ్యారు. అభిజిత్ విన్నర్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు అంతా. అయితే రన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంటూ వచ్చింది. చివరకు విజేత విషయంలో అందరూ అనుకున్నట్టే జరిగింది. అభిజిత్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.

    నాటి నుంచి..

    నాటి నుంచి..

    బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ సోషల్ మీడియాలో మాత్రం అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. తన తదుపరి ప్రాజెక్ట్‌లను ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాడు. కథలను వింటూ సరైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని, మంచి హిట్ కొట్టాలనే ధ్యేయంతో అభిజిత్ ఉన్నాడు.

    మధ్యలో అలా..

    మధ్యలో అలా..

    అయితే అభిజిత్ సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తున్నాడు. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు ఉన్న సమయంలో మాత్రం అభిజిత్ రచ్చ చేస్తున్నాడు. సంక్రాంతి ఈవెంట్, మొన్నటి బిగ్ బాస్ ఉత్సవంలో అభిజిత్ కనిపించి రచ్చ చేశాడు. అయితే తాజాగా మరోసారి బిగ్ బాస్ విజేత సోషల్ మీడియాలో సందడి చేస్తోన్నాడు.

    తిరుమల దర్శనం..

    తిరుమల దర్శనం..

    తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అభిజిత్ తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. అక్కడ దైవ దర్శనం అనంతరం అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. ఆప్యాయంగా మాట్లాడాడు. అంతే కాకుండా అక్కడి మీడియాతో ముచ్చటించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు.

     అందుకేనా?

    అందుకేనా?

    అయితే అభిజిత్ ఇలా సడెన్‌గా వెళ్లడానికి ఏదైనా కారణం ఉందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కథ, స్క్రిప్ట్ ఓకే అయినందుకే అలా దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్లాడా? లేదా బిగ్ బాస్ వల్ల గ్యాప్ రావడంతో ఇలా సాధారణంగానే వచ్చాడా? అని అందరూ అనుకుంటున్నారు.

    English summary
    Bigg boss Abhijeet and his Family Visits Tirumala,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X